Ind-vs-SA: సఫారీ గడ్డపై జరుగుతున్న ఇండియా - దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో మొదటి మ్యాచ్ వర్షార్పణం కాగా రెండవ మ్యాచ్‌లో సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఇక ఇవాళ చివరి మూడవ టీ20 సిరీస్ కోసం కీలకం కానుంది. సిరీస్ సమం చేయడం లేదా కోల్పోవడం రెండే అవకాశాలు టీమ్ ఇండియాకు మిగిలాయిప్పుడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ను 4-1తో చేజిక్కించుకుని ఉత్సాహంతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియాకు ఆశాభంగమైంది. మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు. రెండవ మ్యాచ్‌లో వర్షం అంతరాయం కల్గించినా ఓవర్ల కుదింపులో మ్యాచ్ పూర్తయింది. దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ 1-0 ఆధిక్యం కనబర్చింది. ఇక ఇవాళ చివరి మూడవ టీ20 కీలకమైంది. మూడో మ్యాచ్‌లో విజయంతో సిరీస్ చేజిక్కించుకునేందుకు ప్రోటీస్ టీమ్ ప్రయత్నించనుండగా, ఈ మ్యాచ్‌లో విజయంతో సిరీస్ సమం చేసేందుకు సూర్యకుమార్ నేతృత్వంలోని టీమ్ ఇండియా సర్వ శక్తులు ఒడ్డాల్సి ఉంది.రెండవ టీ20లో మంచి స్కోర్ సాధించినా ఓవర్ల కుదింపుతో టార్గెట్ తగ్గడం, బౌలర్ల వైఫల్యం కారణంగా ఆ మ్యాచ్ ఓడిపోవల్సి వచ్చింది. సిరీస్ సమం చేస్తే భారత్ పరువు నిలబడుతుంది. కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌కు గుర్తింపు లభిస్తుంది. 


సూర్య కుమార్ యాదవ్, రింకూ సింగ్, శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌లు బ్యాటింగ్‌లో రాణించి సిరాజ్, ముకేశ్ కుమార్, జడేజాలు బౌలింగ్‌లో మంచి ప్రదర్శన ఇస్తే టీమ్ ఇండియాకు తిరుగుండకపోవచ్చు. రెండవ మ్యాచ్ ఓటమికి బౌలర్ల వైఫల్యమే ప్రధాన కారణం కావడంతో మూడవ టీ20లో బౌలర్లపై ప్రధానంగా ఒత్తిడి పెరగనుంది. టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్ బలంగా ఉండటమే కాకుండా ఫామ్‌లో ఉండటంతో పెద్దగా ఇబ్బంది లేదు. బౌలింగ్ విభాగమే కలవరపెడుతోంది.


ఇక సిరీస్ 1-0 ఆధిక్యంతో హుషారుగా ఉన్న మార్క్‌రమ్ టీమ్ చివరి మ్యాచ్ గెలవడం ద్వారా సిరీస్ కైవసం చేసుకునేందుకు ప్రయత్నించనుంది. మార్క్‌రమ్, హెన్‌డ్రిక్స్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కోయెట్జి, షమ్సీ, విలియమ్స్ రాణిస్తే ఇక బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంటుంది. 


ఇవాళ చివరి టీ 20 మ్యాచ్ జరగనున్న వాండరర్స్ వికెట్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. అందుకే భారీ స్కోర్ నమోదయ్యే అవకాశముంది. పేస్ బౌలర్లకు కూడా అనుకూలంగా ఉండే పిచ్ కావడంతో కోయెట్జీ, సిరాజ్, ముకేశ్ కుమార్‌లకు అవకాశముంటుంది. టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ తీసుకునే అవకాశాలున్నాయి. వర్షసూచన ఉంది కానీ మ్యాచ్ సమయానికి వాతావరణం మారుతుందనే అంచనా ఉంది. 


టీమ్ ఇండియా అంచనా జట్టు


సూర్య కుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ, రవీంద్ర జడేజా, అర్షదీప్ , కుల్దీప్, మొహమ్మద్ సిరాజ్, ముకేశ్ కుమార్


దక్షిణాఫ్రికా అంచనా జట్టు


మార్క్‌రమ్, హెన్‌డ్రిక్స్, బ్రీట్జ్ కే, క్లాసెన్, మిల్లర్, స్టబ్స్, ఫెలుక్వాయో, జాన్సెన్, కోయెట్జి, లిజాడ్ విలియమ్స్, షమ్సీ


Also read: Loksabha Attack: పార్లమెంట్ భద్రతా లోపంపై సమగ్ర విచారణకు హోంశాఖ ఆదేశం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook