Loksabha Attack: పార్లమెంట్ భద్రతా లోపంపై సమగ్ర విచారణకు హోంశాఖ ఆదేశం

Loksabha Attack: పార్లమెంట్‌పై దాడి జరిగిన సరిగ్గా 20 ఏళ్లకు మరోసారి దుశ్చర్య చోటుచేసుకుంది. కొందరు దుండుగులు లోక్‌‌సభలో చొరబడి టియర్ గ్యాస్‌లతో దాడి చేయడం దేశంలో కలకలం రేపింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Dec 14, 2023, 07:03 AM IST
Loksabha Attack: పార్లమెంట్ భద్రతా లోపంపై సమగ్ర విచారణకు హోంశాఖ ఆదేశం

Loksabha Attack: దేశంలో అత్యాధునికంగా కొత్త పార్లమెంట్ నిర్మించుకున్నా భద్రతా పరంగా ఎంత లోపభూయిష్టంగా ఉందో మరోసారి స్పష్టమైంది. పార్లమెంట్‌పై దాడి జరిగిన పదేళ్లకు యదేఛ్చగా నలుగురు దుండగులు చొరబడి నిండు లోక్‌సభలో స్మోక్ బాంబ్ ప్రయోగించడంపై ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.

లోక్‌సభలో జరిగిన ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. సీఆర్పీఎఫ్ డీజీ అనీష్ దయాళ్ సింగ్ నేతృత్వంలో ఇతర భద్రతా సంస్థలు, నిపుణులకో కమిటీ ఏర్పాటైంది. భద్రతా వ్యవస్థలో లోపమే కారణంగా భావిస్తున్న తరుణంలో ఆ లోపాల్ని గుర్తించడం, భద్రతకు విఘాతం కల్గించిన కారణాలపై దర్యాప్తు చేయడం ఈ కమిటీ చేస్తుంది. అందుకు తగిన పరిష్కారాన్ని కూడా సూచిస్తుంది. భద్రతా వ్యవస్థను ఎలా మెరుగుపర్చాలనే సూచనలు కూడా చేస్తుంది. 

పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో నిన్న లోక్‌సభలోని విజిటర్స్ గ్యాలరీలోంచి కొందరు దుండగులు ఎంపీల గ్యాలరీపై దూకి ఒక్కసారిగా షూలలో దాచుకున్న టియర్ గ్యాస్ ఓపెన్ చేసి దాడి చేయడం సంచలనంగా మారింది. రైతాంగం సమస్యలు, మణిపూర్ సంక్షోభం, నిరుద్యోగం వంటి సమస్యలతో విసిగి ఈ చర్యకు పాల్పడినట్టుగా నిందితులు తెలిపారు. విభిన్న ప్రాంతాల్నించి వచ్చిన ఈ నలుగురు దుండగులు ఒకరికొకరు తెలుసని..పక్కా ప్రణాళికతోనే దాడి చేశారని పోలీసులు తెలిపారు. 

వాస్తవానికి దాడికి పాల్పడింది నలుగురే అయినా మొత్తం ఆరుగురి పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అరెస్టు చేయగా మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం రెక్కీ కూడా నిర్వహించినట్టు తెలుస్తోంది. లోక్‌సభ గ్యాలరీలో ప్రవేశించిన సాగర్ శర్మ, మనో రంజన్‌లను అక్కడికక్కడే అదుపులో తీసుకున్నారు. మరో ఇద్దరు అమోల్ షిండే, నీలంలను పార్లమెంట్ వెలుపల అరెస్టు చేశారు. మరో ఇద్దరు నిందితులు లలిత్, విక్రమ్‌లలో విక్రమ్‌ను గురుగ్రాంలో అరెస్టు చేయగా లలిత్ కోసం గాలిస్తున్నారు. పధకం ప్రకారం ఆరుగురూ లోక్‌సభలో చొరబడాల్సి ఉన్నా..ఇద్దరికే పాస్ లభించడంతో మిగిలినవాళ్లు బయటుండిపోయారు. 

Also read: Best Road Trips: జీవితాంతం మర్చిపోని అద్భుత అనుభూతినిచ్చే 5 రోడ్ ట్రిప్స్ ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News