India beats Sri Lanka and won Seventh Asia Cup title: మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఇక తాజా కప్ తో టీమ్ ఇండియా వరుసగా ఏడోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఆసియా కప్‌లో ఇరు జట్లు ఐదుసార్లు ఫైనల్‌లో తలపడగా, ఆడిన ప్రతిసారి భారత్ శ్రీలంకను ఓడించింది. ఈ టోర్నమెంట్‌లో భారత్ అత్యధికంగా ఏడుసార్లు గెలుపొందగా, శ్రీలంక జట్టు ఐదోసారి ఫైనల్స్ లో ఓడిపోయింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్ ముందు 66 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, టీమిండియా రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి ఆ స్కోర్ సాధించింది. అలా మహిళల ఆసియా కప్ ఫైనల్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక తొమ్మిది వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. దీంతో భారత్ 8.3 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 71 పరుగులు చేసి ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించినట్టు అయింది. ఇండియన్ స్టార్ వుమెన్ క్రికెటర్ స్మృతి మంధాన సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించింది. ఆమె 25 బంతుల్లో 51 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఇక ఆమె ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లతో మంచి జోరు కనబరిచింది. ఇక కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 14 బంతుల్లో 11 పరుగులతో నాటౌట్‌గా నిలిచింది. ఇక శ్రీలంక బౌలర్లలో కవిషా దిల్హరి, రణ్‌వీరా చెరో వికెట్ తీయగలిగారు. ముందుగా  66 పరుగుల స్వల్ప స్కోరును చేధించాల్సిన టార్గెట్ తో బరిలోకి దిగిన ఇందినం టీమ్ లో షెఫాలీ వర్మ ఎనిమిది బంతుల్లో ఐదు పరుగుల వద్ద ఔటైంది.


రణవీరా వేసిన బంతికి వికెట్ కీపర్ సంజీవని స్టంపౌట్ చేసింది. నాలుగు ఓవర్లు ముగిసేసరికి భారత్ ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు సాధించింది. ఇక 35 పరుగుల వద్ద భారత్‌ రెండో వికెట్‌ నష్ట పోయింది. జెమీమా రోడ్రిగ్జ్ భారీ షాట్ ఆడే ప్రయత్నంలో తన వికెట్ కోల్పోవడం ఒకరకంగా షాకింగ్ ఎక్స్ పీరియన్స్ అనే చెప్పాలి. కవిషా దిల్హరి అఆమెను క్లీన్ బౌల్డ్ చేసింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఓపెనింగ్ జోడీ కెప్టెన్ చమరి అట్టపట్టు, వికెట్ కీపర్ అనుష్క సంజీవని నెమ్మదిగా ఆటను ఆరంభించారు. మూడో ఓవర్లో ఎనిమిది పరుగుల స్కోరు ఉన్నప్పుడే శ్రీలంక జట్టుకు తొలి దెబ్బ తగిలింది.


కెప్టెన్ చమరి అటపట్టు 12 బంతుల్లో ఆరు పరుగులు చేసి రనౌట్ అయింది. ఒకరకంగా అప్పుడే శ్రీలంక పతనం మొదలైంది. జట్టు స్కోరు తొమ్మిది పరుగుల వద్ద రెండో వికెట్ పడింది, రేణుకా సింగ్ మాధవి వికెట్ కీపర్ రిచా ఘోష్ చేతికి చిక్కింది. ఆ తరువాత శ్రీలంక మూడో వికెట్ పడింది. ఓపెనర్ సంజీవని రెండు బంతుల్లో నాలుగు పరుగులు చేసి రనౌట్ అయ్యారు. తర్వాతి బంతికే రేణుక హాసిని పెరీరాకు క్యాచ్ ఇచ్చి స్మృతి మంధాన అందుకోవడంతో శ్రీలంక నాలుగు వికెట్లు కోల్పోయింది.


శ్రీలంక జట్టులో సగం మంది పవర్‌ప్లే లోపల పెవిలియన్‌కు చేరుకున్నారు. కవిషా దిల్హారిని రేణుక క్లీన్ బౌల్డ్ చేసి శ్రీలంకకు ఐదో వికెట్ గా నిలిచింది. ఆ తరువాత నీలాక్షి డిసిల్వాను బౌల్డ్ చేయడం ద్వారా రాజేశ్వరి గైక్వాడ్ భారత్‌కు ఆరో వికెట్ అందించింది. అలా మొత్తం మీద జట్టు వికెట్లు వరుసగా పడ్డాయి. అయితే అసలు విషయం ఏమిటంటే ఇప్పటి వరకు 8 సీజన్ల ఆసియా కప్‌లో ఒక్క సీజన్‌లో మినహా ప్రతిసారీ భారత జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బంగ్లాదేశ్‌ మాత్రమే ఒక సీజన్‌లో విజయం సాధించింది. ఇక ఈసారి కూడా మహిళల ఆసియా కప్ బంగ్లాదేశ్‌లో ఆడింది. 


Also Read: T20 World Cup 2022: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. బద్దలవనున్న ధోనీ, యువరాజ్, గేల్ రికార్డ్స్!


Also Read: MS Dhoni Favourite Subject: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook