T20 World Cup 2022: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. బద్దలవనున్న ధోనీ, యువరాజ్, గేల్ రికార్డ్స్!

India vs Pakistan, T20 World Cup 2022: Rohit Sharma eye Yuvraj Singh's Rare Record. టీ20 ప్రపంచకప్ 2022లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డులు సాధించే అవకాశం ఉంది. ఎంఎస్ ధోనీ, యువరాజ్ సింగ్ రికార్డులపై రోహిత్ కన్నేశాడు.   

Written by - P Sampath Kumar | Last Updated : Oct 14, 2022, 10:54 AM IST
  • అక్టోబర్ 16 నుంచి టీ20 ప్రపంచకప్‌ 2022
  • రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు
  • బద్దలవనున్న ధోనీ, యువరాజ్ రికార్డ్స్
T20 World Cup 2022: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. బద్దలవనున్న ధోనీ, యువరాజ్, గేల్ రికార్డ్స్!

Rohit Sharma eye Yuvraj Singh's Rare Record at T20 World Cup 2022: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న టీ20 ప్రపంచకప్ 2022కి సమయం దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో మెగా ఈవెంట్ ఆరంభం కాబోతోంది. అక్టోబర్ 16 నుంచి గ్రూప్ దశ మ్యాచ్‌లు మొదలవుతాయి. ఇక అసలు సమరం అంటే.. సూపర్ 12 మ్యాచులు అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయి. టోర్నీ తొలి మ్యాచ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. అక్టోబర్ 23న దాయాదులు భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం ఫాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి. 

అత్యధిక మ్యాచ్‌లు:
రోహిత్‌ శర్మ ఇప్పటివరకు టీ20 ప్రపంచకప్‌లో 33 మ్యాచ్‌లు ఆడాడు. మరో మూడు మ్యాచ్‌లు ఆడితే.. ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్ తిలకరత్నె దిల్షాన్‌ (35) అగ్రస్థానంలో ఉన్నాడు. డ్వేన్‌ బ్రావో(34), షోయబ్‌ మాలిక్‌ (34), ఎంఎస్‌ ధోనీ (33), క్రిస్‌ గేల్‌ (33), ముష్ఫికర్‌ రహీం (33) రోహిత్ కంటే ముందున్నారు. టీ20 ప్రపంచకప్ 2022 ద్వారా రోహిత్‌ అగ్రస్థానంకే చేరుకోవడం పక్కా. 

అత్యధిక సిక్సర్లు:
టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌ శర్మ ఇప్పటివరకు 31 సిక్సర్లు బాదాడు. మరో మూడు సిక్స్‌లు బాదితే ఈ వెంట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఈ రికార్డు కూడా హిట్‌మ్యాన్‌ అందుకోనున్నాడు. పాకిస్తాన్ మ్యాచులోనే ఈ రికార్డు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ జాబితాలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ (33 సిక్స్‌లు) టాప్‌లో ఉన్నాడు. 

అత్యధిక పరుగులు:
టీ20 ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ మహేళ జయవర్దనేపై అత్యధిక పరుగుల చేసిన రికార్డు ఉంది. ఐదు ప్రపంచకప్‌లు ఆడిన మహేళ.. 1016 పరుగులు చేశాడు. టీ20 ప్రపంచకప్ 2022లో రోహిత్ శర్మ 169 పరుగులు సాధిస్తే అత్యధిక పరుగుల వీరుడిగా నిలవనున్నాడు. ఈ జాబితాలో క్రిస్‌ గేల్‌ 965, తిలకరత్నె దిల్షాన్‌ 897 పరుగులతో 2, 3 స్థానాల్లో ఉన్నారు. ప్రస్తుతం రోహిత్‌ 847 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

సెంచరీ చేస్తే:
2010 ప్రపంచకప్‌లో క్రిస్‌ గేల్‌ విండీస్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో 98 పరుగులు చేశాడు. ఇప్పటివరకు పొట్టి టోర్నీలో ఒక కెప్టెన్‌కు ఇదే అత్యధిక స్కోరు. టీ20 ప్రపంచకప్ 2022లో రోహిత్‌ శర్మ ఈ రికార్డు బద్దలు కొట్టే అవకాశం ఉంది. రోహిత్ సెంచరీ చేస్తే.. గేల్‌ రికార్డు బద్దలు కానుంది. అయితే ఇది కాస్త కష్టమే అని చెప్పాలి. 
Also Read: టీ20 ప్రపంచకప్‌లో భువనేశ్వర్‌ రాణించలేడు.. టీమిండియాకు కష్టాలు తప్పవు: వసీం అక్రమ్‌

Also Read: ప్రేమను నిరాకరించిందని.. ట్రైన్ కింద తోసేసి యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News