IND vs WI Playing XI: సూర్య, శార్దూల్ ఔట్.. ఇషాన్‌కు చోటు! భారత్ తుది జట్టు, డ్రీమ్ ఎలెవన్ టీమ్ ఇదే
IND vs WI 3rd ODI Dream11 Team, IND vs WI Preview and Playing XI. వన్డే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో నామమాత్రమైన చివరి వన్డేకు భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.
India vs West Indies 3rd ODI Dream11 Team: భారత్ జైత్రయాత్ర కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లండ్, ఐర్లాండ్‌పై వసరుసగా సిరీస్‌లు గెలిచిన భారత్.. విండీస్ గడ్డపై కూడా సత్తాచాటుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే రెండు మ్యాచులు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్ బుధవారం జరగనున్న చివరి వన్డేలోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని చూస్తోంది. మరోవైపు రెండు మ్యాచ్‌ల్లో ఓడిన విండీస్.. చివరి మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి పరువు కాపాడుకోవాలని చూస్తోంది. దాంతో మూడో వన్డే కూడా అభిమానులను అలరించే అవకాశం ఉంది.
వన్డే సిరీస్ కైవసం చేసుకున్న నేపథ్యంలో నామమాత్రమైన చివరి వన్డేకు భారత్ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కనుంది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. రుతురాజ్ ఆడాలంటే.. శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్‌లలో ఒకరు బెంచ్‌కే పరిమితం కానున్నారు. ధావన్ కెప్టెన్ కాబట్టి.. గిల్‌ను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ జట్టులోకి రావాలంటే సంజూ శాంసన్ లేదా సూర్యకుమార్ యాదవ్‌లలో ఒకరికి రెస్ట్ ఇవ్వాలి. సంజూ హాఫ్ సెంచరీతో సత్తాచాటడంతో సూర్యపై వేటు పడే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్, దీపక్ హుడా జట్టులో కొనసాగనున్నారు.
జస్ప్రీత్ బుమ్రా గైర్హాజరీలో మొహ్మద్ సిరాజ్ బౌలింగ్ విభాగాన్ని లీడ్ చేయనున్నాడు. శార్దూల్ ఠాకూర్ వికెట్లు తీస్తున్నా భారీగా పరుగులు ఇస్తున్నాడు. దాంతో టీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్‌కు అవకాశం దక్కొచ్చు. రెండో మ్యాచుతో జట్టులో అరంగేట్రం చేసిన ఆవేశ్ ఖాన్ కొనసాగనున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చహల్ ఆడనున్నారు.
భారత తుది జట్టు (అంచనా):
శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్/రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, దీపక్ హుడా, అక్షర్ పటేల్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, యుజ్వేంద్ర చహల్.
డ్రీమ్ ఎలెవన్ టీమ్:
షాయ్ హోప్, శిఖర్ ధావన్, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వైస్ కెప్టెన్), కైల్ మేయర్స్, రొమారియో షెపర్డ్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చహల్, శార్దూల్ ఠాకూర్, అల్జారీ జోసెఫ్.
Also Read: Ranveer Singh FIR: న్యూడ్ ఫోటోషూట్.. స్టార్ హీరో రణవీర్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు!
Also Read: High Cholesterol Levels: శరీరంలో కొలెస్ట్రాల్ ఎదైనా.. ఇలా 5 రోజుల్లో చెక్ పెట్టండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.