ఊహించినట్లుగానే భారత్ వరల్డ్ కప్ టోర్నీలో సెమీస్ కు చేరింది. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో విజయంతో ఎలాంటి సమీకరణలతో సంబంధం లేకుండానే నేరుగా కోహ్లీసేన సెమీస్ లో  ప్రవేశింది. బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భారీ టార్గెట్ ముందు తలవంచిన బంగ్లా


మ్యాచ్ వివరాల్లోకి వెళ్లినట్లయితే భారత్ ఉంచిన 315 పరుగుల టార్గెట్ తో బరిలోకీ దిగిన బంగ్లా జట్టు విజయం కోసం తీవ్రంగా పోరాడి చివరికి ఓటమి పాలైంది. టార్గెట్ చేధించేందకు బంగ్లా బ్యాట్స్ మెన్లు ఎంతగా ప్రయత్నించినప్పటికీ  భారత్ బౌలర్లు పెంచిన ఒత్తిడికి తట్టుకోలేక  48 ఓవర్లలో 286 పరుగులకే చేతులెత్తేశారు. ఈ మ్యాచ్ లో బుమ్రా మ్యాజిక్ చేసి చివర్లో 4 వికెట్లు పడగొట్టగా.. హార్దిక్ పాండ్యా కీలకమైన మూడు వికెట్లు దక్కించుకున్నాడు.


పోరాడి ఓడిన బంగ్లా టైగర్లు


బంగ్లాదేశ్ తరఫున షకీబుల్ హసన్ అర్థసెంచరీ (66)తో రాణించగా మిగిలిన బ్యాట్స్ మెన్లు విజయం కోసం తమ వంతు  ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా లోయర్ ఆర్డర్ లో బరిలోకి దిగిన షబ్బీర్ అహ్మద్ (36), మొహమ్మద్ షఫివుద్దీన్ (51) గెలుపు కోసం పోరాట పటిన ప్రదర్శించారు. టార్గెట్ చేధించే క్రమంలో మ్యాచ్ చివరి దశలో వీరు పెలిలియన్ బాట పట్టడంతో బంగ్లా ఓటమి ఖాయమైంది. చివరకు బంగ్లా టీం 48 ఓవర్లు ఎదుర్కొని 286 పరుగుల మాత్రమే చేసి  చేతులెత్తేసింది.ఫలితంగా టీమిండియా 28 పరుగుల తేడాతో విజయాన్ని సొంతం చేసుంది.


సెంచరీతో కదం తొక్కిన రోహిత్


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటంగ్ ఎంచుకున్న భారత్  రోహిత్ శర్మ సెంచరీతో కదం తొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లకు టీమిండియా 314 పరుగులు చేసింది. భారత్ కు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని ఇచ్చారు. రోహిత్ 104 పరుగులు చేయగా..మరో ఓపెనర్ లోకేష్ రాహుల్ 77 పరుగులు చేశాడు. తొలి వికెట్ కు ఇరువురు 180 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ తర్వాత వచ్చిన కోహ్లీ 26 పరుగులు, రిషబ్ పంత్ 48 పరుగులు, ధోని పరుగులు 35 చేయడంతో భారత్ 300 పరుగుల పైచిలు పరుగులు రాబట్టగల్గింది.