Ind W vs Aus W 01st T20I Highlights: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో విఫలమైన భారత అమ్మాయిలు.. టీ20ల్లో అదరగొట్టారు. తొలి మ్యాచ్ లో కంగారూ జట్టును చిత్తు చేసింది హర్మన్‌ప్రీత్‌ సేన. షఫాలీ వర్మ, స్మృతి మంధన బ్యాటింగ్ లో ఇరగదీయగా.. భారత యువ కెరటం టిటాస్‌ సధు(Titas Sadhu) ఆసీస్ వెన్నువిరిచింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత మహిళల జట్టు 1-0తో లీడింగ్ లో ఉంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టు బ్యాటర్లలో లిచ్‌ఫీల్డ్‌ (32 బంతుల్లో 49; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఎలీసా పెర్రీ (37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే రాణించారు. మిగత వాళ్లంతా సింగిల్ డిజిట్స్ కే పరిమతమయ్యారు. కెప్టెన్ అలీసా హీలీ కేవలం 8 పరుగులు మాత్రమే చేసింది. తహీలా మెక్‌గ్రాత్‌, ఆష్లే గార్డ్‌నర్‌లు అయితే ఖాతానే తెరవలేదు. గ్రేస్‌ హారీస్‌ (1), బెత్‌ మూనీ (17)  విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లలో టిటాస్‌ సధు 4, శ్రేయాంక పాటిల్‌, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు తీశారు. 


Also Read: T20 World Cup 2024 Schedule: టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆ రోజే..!


అనంతరం లక్ష్యఛేదనను ప్రారంభించిన భారత్‌ 17.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోయి145 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (44 బంతుల్లో 64 నాటౌట్‌; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), స్మృతి మంధన (54; 7 ఫోర్లు, ఒక సిక్సర్‌) హాఫ్‌ సెంచరీలు సాధించారు. టిటాస్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ అవార్డు దక్కింది. రెండో టీ20 మ్యాచ్ ఆదివారం జరగనుంది. ఈ ఏడాది చివర్లో టీ20 ప్రపంచకప్‌ జరగనున్న నేపథ్యంలో ఈసారి యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇస్తుంది టీమ్ మేనెజ్మెంట్..అందుకు తగ్గట్టే వారు కూడా రాణిస్తున్నారు. టిటాస్ ను ఆఖరి నిమిషంలో తుది జట్టులోకి తీసుకున్నట్లు హార్మన్ ఫ్రీత్ చెప్పింది. 



Also Read: ICC Awards: ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్‌ ద ఇయర్.. నలుగురు ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  



ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి