T20 World Cup 2024 Schedule: టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆ రోజే..!

India Vs Pakistan in T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్‌ వచ్చేసింది. మ్యాచ్‌ల వివరాలను ఐసీసీ శుక్రవారం ప్రకటించింది. 20 జట్లను నాలుగు గ్రూపులుగా విభజించింది. భారత్, పాకిస్థాన్ ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. దాయాదుల మధ్య సమయం జూన్ 9న జరగనుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jan 5, 2024, 08:25 PM IST
T20 World Cup 2024 Schedule: టీ20 వరల్డ్ కప్‌ షెడ్యూల్ విడుదల.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ ఆ రోజే..!

India Vs Pakistan in T20 World Cup 2024: వెస్టిండీస్-అమెరికా సంయుక్తంగా అతిథ్యం ఇవ్వనున్న టీ20 వరల్డ్ కప్‌ 2024 షెడ్యూల్‌ను ఐసీసీ విడుదల చేసింది. జూన్ 1వ తేదీ నుంచి పొట్టి కప్ సమరం ప్రారంభంకానుంది. మొత్తం 55 మ్యాచ్‌లు 9 వేదికలపై జరుగుతాయి. జూన్ 1న టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కెనడాతో అమెరికా తలపడనుంది. టోర్నీలో పాల్గొనే జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించగా.. గ్రూప్‌-ఏలో భారత్, పాకిస్థాన్, USA, కెనడా, ఐర్లాండ్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్ Bలో ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, నమీబియా, స్కాట్లాండ్, ఒమన్ ఉన్నాయి. గ్రూప్ సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, ఉగాండా, పపువా న్యూ గినియా ఉండగా.. గ్రూప్ డిలో దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్, నేపాల్ ఉన్నాయి.

మొత్తం 20 జట్లు టీ20 వరల్డ్ కప్ కోసం పోటీ పడనున్నాయి. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య జూన్‌ 9న న్యూయార్క్‌ వేదికగా జరగనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్‌లు ట్రినిడాడ్ అండ్ టొబాగో, గయానాలో జరుగుతాయి. జూన్ 29న జరిగే ఫైనల్ మ్యాచ్‌కు బార్బడోస్‌ వేదిక కానుంది. లీగ్ దశ ముగిసిన తరువాత ప్రతి గ్రూప్ నుంచి రెండు జట్లు సూపర్-8కు చేరుకుంటాయి. ఆ తరువాత సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. భారత్‌కు సంబంధించిన అన్ని మ్యాచ్‌లు అమెరికా గడ్డపై జరుగుతాయి.

టీమిండియా ఉండే గ్రూప్ A షెడ్యూల్ ఇలా..

==> భారత్ vs ఐర్లాండ్ - 5 జూన్
==> భారత్ vs పాకిస్థాన్ - 9 జూన్
==> భారత్  vs USA - 12 జూన్
==> భారత్ vs కెనడా - 15 జూన్

Also Read: Telangana MLC Elections: తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసీ బిగ్ ట్విస్ట్.. బీఆర్ఎస్‌కు దిమ్మతిరిగే షాక్  

Also Read: Guntur Kaaram Update: 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ ర‌ద్దు.. కారణం ఇదే!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News