Karun Nair: ప్రేయసిని పెళ్లాడిన భారత క్రికెటర్ కరుణ్ నాయర్
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ వీరుడు, భారత క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో చిన్ననాటి స్నేహితురాలు, ప్రేయసి సనయ తంకరివాలాను వివాహం చేసుకున్నాడు.
భారత స్పెషల్ క్రికెటర్ కరుణ్ నాయర్ ఓ ఇంటివాడయ్యాడు. చిన్ననాటి స్నేహితురాలు సనయ తంకరివాలాను ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. రాజస్థాన్ ఉదయ్‌పూర్‌లో వీరి వివాహం జరిగింది.. బంధువులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఈ జంట కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. గతేడాది జూన్ నెలలో వీరి పెళ్లికి పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏడు నెలల కిందట నిశ్చితార్థం చేసుకున్న కరుణ్ నాయర్, సనయ తంకరివాలా జంట పెళ్లితో ఒక్కటైంది.
తన పెళ్లి ఫొటోలను అభిమానులతో కరుణ్ షేర్ చేసుకున్నాడు. టీమిండియా ఆటగాళ్లు అజింక్య రహానే, శార్దూల్ ఠాకూర్, వరుణ్ ఆరోన్, శ్రేయస్ అయ్యర్ వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. కరుణ్ దంపతులతో దిగిన ఫొటోలను వరుణ్ ఆరోన్ అభిమానులతో షేర్ చేసుకున్నాడు. కొత్త జంటకు పలువురు క్రికెటర్లు, మాజీలు శుభాకాంక్షలు చెబుతున్నారు.
Also Read: సరికొత్త చరిత్ర సృష్టించనున్న షఫాలీ వర్మ
కాగా, టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ నమోదు చేసిన రెండో క్రికెటర్ కరుణ్ నాయర్. తొలి క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ అని తెలిసిందే. అయితే ట్రిపుల్ సెంచరీ తర్వాత ఆడిన ఐదు టెస్టు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 71 పరుగులు చేయడంతో సెలెక్టర్లు కరుణ్‌ను పక్కన పెట్టేశారు. దేశవాలీలో రాణించి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..