Indian former Tennis Player: భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఇటీవల షోయబ్ మాలిక్ తో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆమె కుటుంబం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది. సానియా ముందు నుంచి తన వ్యక్తిగత విషయాలను ఎవరితోను పంచుకొవడానికి ఆసక్తి చూపదని సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా సానియా ఇన్ స్టా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. రిఫ్లెక్ట్ అనే క్యాప్షన్‌ జతపరుస్తు అద్దం ముందు ఆమె తన ఫోటో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం తనను తాను తిరిగి సమీక్షించుకుంటున్నట్లు అర్ధం వచ్చేలా క్యాప్షన్ జతచేశారు. దీనిలో మరల ఆమె తన జీవితాన్ని తిరిగి ప్రారంభించాలి. ఒత్తిడిని అధిగమించి తిరిగి ఉల్లాసంగా జీవితం మరల ప్రారంభించాలని కూడా అర్థం వచ్చేలా పోస్ట్ చేశారు. అయితే.. సానియా పోస్ట్ కు ఆమె ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్ లు పెడుతున్నారు.


Read Also: Ayodhya: హనీమూన్ కోసం అయోధ్య కు వెళ్దామన్న భర్త.. కొత్త పెళ్లికూతురు ఏంచేసిందో తెలుసా..?


ఇలాంటి కష్టసమయంను ధైర్యంగా ఎదుర్కొవాలని కామెంట్ లు చేస్తున్నారు. తిరిగి సానియా నవ్వుతూ.. జీవితం ప్రారంభించాలని కూడా ఆమెకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటికే సానియా కుటుంబం, షోయబ్ కోత్తజీవితాలనికి శుభాకాంక్షలు కూడా తెలిపారు. అదేవిధంగా సానియా.. తీసుకున్న నిర్ణయానికి గౌరవించాలని అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. సానియా, షోయబ్ ల వివాహం ఏప్రిల్ 2010లో జరిగింది.


ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా మీర్జాను మాలిక్ అన్‌ఫాలో చేయడంతో పుకార్లు జోరందుకున్నాయి.  ఈ చర్య వారి వైవాహిక విభేదాల గురించి ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది. కాగా, వీరికి ఐదేళ్ల కుమారుడు ఐజాన్ తల్లి సానియా దగ్గరే ఉంటున్నాడు. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook