Mohammed Siraj`s father died: ఆసిస్ పర్యటనలో ఉన్న సిరాజ్‌కి పితృ వియోగం..
హైదరాబాద్ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. అతడి తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ గౌస్.. అదే సమస్యతో తుది శ్వాస విడిచారు. సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ అతడికి ఈ వార్తను తెలియజేసింది.
హైదరాబాద్ : టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా.. అతడి తండ్రి మహ్మద్ గౌస్ (53) శుక్రవారం మృతి చెందారు. గత కొంత కాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న మహ్మద్ గౌస్.. అదే సమస్యతో తుది శ్వాస విడిచారు. సిడ్నీలో ప్రాక్టీస్ సెషన్ తర్వాత జట్టు మేనేజ్‌మెంట్ అతడికి ఈ వార్తను తెలియజేసింది. ఆసీస్ గడ్డపై టీమిండియా తరపున టెస్ట్ సిరీస్ ఆడేందుకు వెళ్లిన మహ్మద్ సిరాజ్.. క్వారంటైన్ రూల్స్ కారణంగా వెంటనే తిరిగి భారత్‌కి వచ్చే అవకాశం లేదు. దీంతో సిరాజ్ తన తండ్రి చివరి చూపునకు దూరమవాల్సిన పరిస్థితి తలెత్తింది.
తన తండ్రి మహ్మద్ గౌస్ మృతిపై సిరాజ్ స్పందిస్తూ.. ‘నేను దేశం తరుపున క్రికెట్ ఆడి దేశానికి గొప్ప పేరు తీసుకురావాలనేదే మా మా నాన్న ఆశయం. ఆయన ఆశయాన్ని సాధించడానికే కృషి చేస్తాను. ఆటోరిక్షా నడుపుకుంటూ మరీ మా నాన్న నాకు క్రికెట్‌లో రాణించేందుకు కృషి చేశారని.. ఆయన మృతి నన్ను తీవ్రంగా బాధించిందని సిరాజ్ కన్నీటి పర్యంతమయ్యాడు.
ఒకవైపు తండ్రిని కోల్పోయిన ( Mohammed Siraj's father Mohammed Ghouse passes away ) బాధలో ఉండి కూడా తండ్రి ఆశయం కోసమే పనిచేస్తానని చెబుతున్న సిరాజ్‌కి నెటిజెన్స్ నుంచి సానుభూతి వ్యక్తమవుతోంది.
తండ్రి కలను నిజం చేసే శక్తనివ్వమని ఆ భగవంతుడిని ప్రార్దిద్దాం అంటూ మహ్మద్ సిరాజ్ ( Indian pacer Mohammed Siraj ) అభిమానులు సోషల్ మీడియా ద్వారా అతడికి తమ మద్దతును తెలియజేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి