Indian Para powerlifter Sudhir wins gold medal in CWG 2022: బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2022లో భారత్ ఆటగాళ్లు సత్తాచాటుతున్నారు. గురువారం అర్ధ రాత్రి దాటిన తర్వాత జరిగిన పురుషుల పారా హెవీ వెయిట్‌ లిఫ్టింగ్‌లో సుధీర్‌ పసిడి పతకం సాధించాడు. దాంతో కామన్వెల్త్ క్రీడల చరిత్రలో పారా పవర్ లిఫ్టింగ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారతీయుడిగా సుధీర్ చరిత్ర సృష్టించాడు. సుధీర్ పసిడి గెలవడంతో భారత్‌ బంగారు పతకాల సంఖ్య 6కు చేరింది. ఇక మొత్తంగా 20 పతకాలు సాధించిన భారత్.. ప్రస్తుతం పతకాల పట్టికలో ఏడవ ర్యాంకులో కొనసాగుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

134.5 పాయింట్లతో సుధీర్‌ గోల్డ్‌ మెడల్ సాధించాడు. తొలి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తిన సుధీర్‌.. రెండో విడతలో 212 కేజీలు ఎత్తి 134.5 పాయింట్లను సాధించాడు. నైజీరియా పారా వెయిట్‌లిఫ్టర్‌కు చెందిన క్రిస్టియన్‌ 133.6 పాయింట్లతో రజతం, ఇంగ్లండ్ పారా వెయిట్‌లిఫ్టర్‌ మిక్కీ యులే కాంస్య పతకం దక్కించుకున్నాడు. పారా పవర్ లిఫ్టింగ్‌లో విజేతను పాయింట్ల ఆధారంగా నిర్ణయిస్తారన్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనేవారి శరీర బరువు, వారు ఎత్తే బరువు ఆధారంగా పాయింట్లు లెక్కిస్తారు.


27 ఏళ్ల సుధీర్‌ ఆసియాన్‌ పారా గేమ్స్‌లో రజతం గెలిచాడు. కామన్వెల్త్‌ 2022లో స్వర్ణం సాధించడం విశేషం. గత జూన్‌లో దక్షిణ కొరియా వేదికగా జరిగిన వరల్డ్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌ ఆసియా-ఓసియన్‌ ఓపెన్‌ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమంగా 214 కేజీలు ఎత్తి రజతం సాధించాడు. పారా పవర్ లిఫ్టింగ్‌లో భారత్‌కు స్వర్ణం రావడంతో.. భారత పారా కంటింజెంట్ సంబరాల్లో మునిగితేలారు. మరోవైపు దేశ ప్రజలు కూడా సుధీర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.



హరియాణాలోని సోనిపట్‌లోని సుధీర్.. సాధారణ వ్యవసాయం కుటుంబంలో జన్మించాడు. నాలుగేళ్ల వయసులోనే విధి వక్రీకరించడంతో పోలియో బారిన పడి అంగవైకల్యానికి గురయ్యాడు. అయినా కూడా క్రీడలపై మక్కువ పెంచుకుని సాధన చేశాడు. సుధీర్ క్రీడా ప్రస్థానం 2013లో మొదలైంది. పారా పవర్ లిఫ్టింగ్ ఈవెంట్‌ను ఎంచుకుని రాణించాడు. 2016లో తొలిసారి నేషనల్ ఛాంపియన్‌గా నిలిచాడు. 2018లో ఆసియా పారా గేమ్స్‌కు ఎంపికయ్యాడు. అక్కడ భారత్‌కు కాంస్యాన్ని అందించి అంతర్జాతీయ కెరీర్‌ను ఘనంగా మొదలెట్టాడు. 


Also Read: Gold Price Today August 5: పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో నేటి పసిడి ధరలు ఇవే!


Also Read: Sita Ramam Twitter Review: ప్రేక్షకుల ముందుకు 'సీతారామం'.. టాక్‌ ఎలా ఉందంటే?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook