ఇండియాలో ఎక్కడైనా సరే వివిద కార్యక్రమాలకు సెలెబ్రిటీలు, రాజకీయ నేతలు చాలా ఆలస్యంగా వస్తుంటారు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. అంతా నడుస్తుందిలే అనుకుంటారు. సరైన షాక్ తగిలేవరకే ఇదంతా. ఏదైనా జర్క్ తగిలితే అప్పుడు తెలుస్తుంది టైమ్ విలువ అంటే ఏంటో. అందుకే కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మైకు తీవ్ర చేదు అనుభవం ఎదురైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియన్ సెలెబ్రిటీలు ముఖ్యంగా రాజకీయ నాయకులు నాన్ పంక్చ్యువాలిటీకి పెట్టింది పేరు. ఏ కార్యక్రమమైనా ఆలస్యంగా రావడం ఓ అలవాటుగా చేసుకుంటారు. టైమ్ మెయింటెనెన్స్ అనేది అస్సలుండదు. అందుకే ఇండియన్ పంక్చ్యువాలిటీ పేరు సార్ధకమైపోతుంటుంది. అన్ని చోట్లా ఇలానే ఉంటే కుదరదు కదా..అన్ని చోట్లా అందరి ముందు ఇది నడవదు. అదే జరిగింది కర్ణాటకలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి. 


కర్ణాటక స్టేట్ లాన్ టెన్నిస్ అసోసియేషన్ ఓ వేడుక నిర్వహించింది. ఈ వేడుకలో 11 సార్లు గ్రాండ్ స్లామ్ విన్నర్, మాజీ ఇండియన్ టెన్నిస్ స్టార్ విజయ్ అమృతరాజ్‌ల సన్మాన కార్యక్రమం ఉంది. కానీ కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై ఆలస్యంగా రావడంతో ఆ సన్మానం జరగలేదు. సన్మానం జరగలేదనే కంటే..సన్మానాన్ని తిరస్కరించారనాలి. 


స్వీడన్ దేశస్థుడు టెన్నిస్ లెజెండ్ బిజోర్న్ బోర్గ్ కెరీర్ ఉన్నత శిఖరాల్లో ఉన్నప్పుడు 27 ఏళ్ల వయస్సులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. బెంగళూరు ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ సందర్భంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అతని కుమారుడు లియో కోసం బెంగళూరుకు వచ్చాడు బోర్గ్. ఈ సందర్భంగా కేఎస్ఎల్ టీఏ సన్మానం తలపెట్టింది. ఈ సన్మానం ముఖ్యమంత్రి ఎస్‌ఆర్ బొమ్మై చేతుల మీదుగా జరగాల్సి ఉంది. యధావిధిగా బొమ్మై సన్మాన కార్యక్రమానికి చాలా ఆలస్యంగా హాజరయ్యారు. దాంతో కార్యక్రమం గంటన్నర ఆలస్యం కావడంతో బిజోర్న్ బోర్గ్ సన్మానాన్ని తిరస్కరించాడు. 


వాస్తవానికి సన్మానం ఉదయం 9.30కు జరగాల్సి ఉంది. కానీ ముఖ్యమంత్రి రాక ఆలస్యం కావడంతో 10.15కు మార్చారు. 11 గంటలకు బోర్గ్ కొడుకు లియోను మ్యాచ్‌కు తీసుకెళ్లేటప్పుడు కూడా బొమ్మై కన్పించలేదు. అప్పడే సన్మానానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడు. బొమ్మై చివరికి అంటే 11.15 గంటలకు వచ్చారు. కానీ కొడుకు మ్యాచ్ అప్పటికే ప్రారంభ కావడంతో బోర్గ్ సన్మానానికి దూరంగా ఉండిపోయాడు. 


ఇతర కమిట్‌మెంట్స్ కారణంగా ముఖ్యమంత్రి బొమ్మై రాక ఆలస్యమైందని ఆర్గనైజింగ్ కమిటీ తెలిపింది. కొడుకు మ్యాచ్ చూస్తున్నందున బోర్గ్ సన్మానానికి హాజరు కావడం లేదని ముఖ్యమంత్రికి వివరించారు. దాంతో మరో ఆప్షన్ లేక ముఖ్యమంత్రి బొమ్మై..15-20 నిమిషాలు మ్యాచ్ చూసి వెళ్లిపోయారు


Also read: Deepak Chahar: సీఎస్‌కే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్‌కు దీపక్ చాహర్ రెడీ



 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook