ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో తొలుత టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకోగా.. భారత బౌలర్ల ధాటికి కంగూరూలు నిజంగానే కంగారు పడినంత పనైంది. మన కుర్రాళ్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ను కట్టడి చేస్తూ బౌలింగ్ చేస్తూంటే.. అదేస్థాయి ఊపును పరుగుల వరదలను ఆపడానికి ఫీల్డర్లు కూడా ప్రదర్శించారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు 47.2లో ఓవర్లలో 216 పరుగులకే చేతులెత్తేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కనుక ఇప్పుడు మన యువ బ్యాట్స్‌మన్ చేతుల్లోనే విజయం ఆధారపడి ఉంది. వరల్డ్ కప్ చేజిక్కించుకొనే అవకాశం కూడా లభించింది.  వివరాల్లోకి వెళితే ఇషాన్‌ పోరెల్‌ బౌలింగ్‌లో ఓపెనర్‌ బ్రయంత్‌ (14) ఓటయ్యాక.. కెప్టెన్ సంఘా(13) కూడా అనుకున్న స్థాయిలో ఏమీ ఆడకపోవడంతో భారత్ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది.


అలాగే ఇషాన్ బౌలింగ్‌లోనే  ఓపెనర్‌ ఎడ్వర్ట్స్‌(28) కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఆ తర్వాత వచ్చిన..  మెర్లో(76) కాస్త స్కోరు పెంచడానికి ప్రయత్నించారు. అయితే తనకు సహకారం ఇవ్వడంలో తర్వాత వచ్చిన ఆటగాళ్ళు గానీ, టెయిలెండర్లు గానీ ఫెయిల్ అవ్వడంతో స్కోరు 216 దగ్గరే ఆగిపోయింది. ఇప్పుడు భారత్ కప్ గెలవాలంటే.. మన బ్యాట్స్‌మన్ నిలకడగా ఆడాల్సిందే. అయితే ఆస్ట్రేలియా బౌలర్లను కూడ తక్కువ అంచనా వేయలేమని అంటున్నారు విశ్లేషకులు.