Indian Women Cricket: మిథాలీరాజ్ రిటైర్మెంట్.. టీమిండియా తదుపరి కెప్టెన్ ఎవరంటే..?
Indian Women Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు నూతన కెప్టెన్ ను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటించినా కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది.
Indian Women Cricket: భారత మహిళా క్రికెట్ జట్టుకు నూతన కెప్టెన్ ను బీసీసీఐ ప్రకటించింది. మిథాలీరాజ్ రిటైర్మెంట్ ప్రకటించినా కొద్ది గంటల్లోనే ఈ నిర్ణయం వెలువడింది. త్వరలో జరిగే శ్రీలంక సిరీస్ కు హర్మన్ ప్రీత్ కౌర్ ను బీసీసీఐ కెప్టెన్ గా, స్మృతి మందానను వైస్ కెప్టెన్‌గా అనౌన్స్ చేసింది. భారత మహిళా జట్టు శ్రీలంకతో దంబుల్లా వేదికగా మూడు టీట్వంటీలు, క్యాండీ వేదికగా మూడు వన్డేలు ఆడనుంది.
వన్డే జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందానా(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్టికా బాటియా(వికెట్ కీపర్) మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహుదూర్, రిచా గోష్(వికెట్ కీపర్౦, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, తానియా బాటియా(వికెట్ కీపర్), హర్లీన్ డియోల్
టీట్వంటీ జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(కెప్టెన్), స్మృతి మందానా(వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్టికా బాటియా(వికెట్ కీపర్) మేఘనా, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, సిమ్రాన్ బహుదూర్, రిచా గోష్(వికెట్ కీపర్౦, పూజా వస్త్రాకర్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రోడ్రిగ్రిస్, రాధా యాదవ్ ఉన్నారు
వన్డే జట్టుకు సంబంధించి జులన్ గోస్వామితో పాటు స్నేహరాణాకు అవకాశం ఇవ్వలేదు. అయితే అనూహ్యంగా 2019లో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడిన హర్లీన్ డియోల్ ను సెలెక్ట్ చేసింది. ఇక టీట్వంటీ జట్టులో రోడ్రిగ్రిస్ కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ. లెఫ్ట్ ఆర్మ్ అర్థోడాక్స్ స్పిన్నర్ అయిన రాధాయాదవ్‌కు జట్టులో చోటు కల్పించిన సెలక్షన్ కమిటీ.. ఎక్తా బిస్ట్ ను పక్కనబెట్టింది.
Also Read: IND vs SA: 25 ఏళ్ల జవగళ్ శ్రీనాథ్ రికార్డును.. ఉమ్రాన్ మాలిక్ బ్రేక్ చేస్తాడా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి