Mithali Raj 10 Major Records in 23-year Long Cricketing Career: భారత క్రికెట్‌కు మాత్రమే కాదు.. మహిళా క్రికెట్‌కే వన్న తెచ్చిన 'మిథాలీ రాజ్' శకం ముగిసింది. భారత మహిళల క్రికెట్లో రెండు దశాబ్ధాల క్రితం కొత్త వరవడిని సృష్టించిన మిథాలీ.. ఆటకు గుడ్ బై చెప్పారు. 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా.. తన బ్యాటింగ్, నాయకత్వ లక్షణాలతో భారత జట్టును ముందుకు తీసుకువెళ్లారు. అసాధారణ బ్యాటింగ్ శైలితో భారత మహిళా క్రికెటర్లకు ప్రేరణగా నిలిచారు. మిథాలీ కెరీర్ ఎంతో మంది యువ క్రీడాకారిణిలకు ఆదర్శం.
రెండేళ్ల క్రితం పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన మిథాలీ రాజ్.. బుధవారం (జూన్ 8) అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఇటీవల న్యూజిలాండ్‌లో జరిగిన వరల్డ్‌కప్ 2022లో చివరిసారి మైదానంలోకి దిగారు. తన కెరీర్లో భారత్ తరఫున 12 టెస్టులు, 232 వన్డేలు, 89 టీ20 మ్యాచ్‌లను ఆడారు. 39 ఏళ్ల మిథాలీ తన సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో రికార్డులు నెలకొల్పారు. అరుదైన రికార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచారు. మిథాలీ రాజ్ అరుదైన రికార్డులు ఓసారి చూద్దాం.
అరుదైన రికార్డులు:
# వన్డేల్లో అత్యధిక పరుగులు (7805) చేసిన మహిళా క్రికెటర్
# వన్డే క్రికెట్లో అత్యధిక అర్ధ శతకాలు (64) బాదిన మహిళా క్రికెటర్
# మహిళల వన్డేల్లో వరుసగా ఏడు హాఫ్ సెంచరీలు
# ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు (1321) చేసిన రెండో మహిళా బ్యాటర్
# అంతర్జాతీయ టీ20లలో అత్యధిక పరుగులు (2364) సాధించిన భారత మహిళా క్రికెటర్
# వన్డేల్లో అత్యధిక సెంచరీలు (7) చేసిన భారత మహిళా క్రికెటర్
# మహిళా క్రికెట్లో 10 వేల కంటే (10868) ఎక్కువ పరుగులు సాధించిన తొలి బ్యాటర్
# మహిళా టెస్టు క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు (214) సాధించిన బ్యాటర్
# మహిళా ప్రపంచకప్‌లలో ఆరుసార్లు ( 2000, 2005, 2009, 2013, 2017, 2022) పాల్గొన్న క్రికెటర్
# మహిళా వన్డే క్రికెట్లో అతి పిన్న వయసులో (16 ఏళ్ల 205 రోజులు) సెంచరీ సాధించిన బ్యాటర్
# వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక మ్యాచ్‌లకు సారథ్యం వహించిన మహిళా కెప్టెన్
# మహిళా ప్రపంచకప్‌లలో అత్యధిక సార్లు (12) హాఫ్ సెంచరీ చేసిన బ్యాటర్
Also Read: Mithali Raj Retires: మిథాలీ రాజ్.. మీరు చాలా మందికి రోల్ మోడల్! గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి