ముంబై: ప్రపంచకప్‌ కోసం భారత క్రికెట్ జట్టును ప్రకటించారు. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రితో సుదీర్ఘ చర్చల తర్వాత ఈ టీమ్‌ని ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లి జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తుండగా రోహిత్ శర్మ కు వైఎస్ కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడో ఓపెనర్ గా రాహుల్
ఓపెనర్ల విషయానికి రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఎంపిక చేసిన సెలెక్టర్లు.. మూడో ఓపెనర్ గా కేఎల్ రాహుల్ ను ఎంపిక చేశారు. టాప్ ఆర్డర్ లో కోహ్లీ తో పాటు కేఎల్ రాహుల్ కు రంగంలోకి దిగే అవకాశముంది. మిడిల్ ఆర్డర్ లో మహేందర్ సింగ్ ధోనీ, జాదవ్ ఉన్నారు


ధోనికి అండగా దినేష్..
వికెట్ కీపర్ విషయానికి వస్తే మెయిన్ వికెట్ కీపర్ గా ధోనీని ఎంపిక చేసిన సెలెక్టర్లు..రెండో వికెట్ కీపర్ గా దినేష్ కార్తీక్ ను ఎంపిక చేశారు. వరల్డ్ కప్ ఆడాలని ఎన్నోకలలు కన్న యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‌కి అవకాశం దక్కలేదు. అలాగే మన తెలుగు తేజం అంబటి రాయుడికి మొండి చేయి చూపించారు.


ముగ్గురు మొనగాళ్లు...
ఇక పేసర్ల విషయానికి వస్తే సీనియర్ అయిన షమీ ఫేస్ త్రయానికి నాయకత్వం వహించనున్నారు. అలాగే జస్‌ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్ లను ఎంపిక చేశారు. ఆల్ రౌండర్ల కోటాలో జడేజా, జాదవ్, హార్డిక్ పాండ్యాలకు స్థానం దక్కింది. ఇక స్పిన్నర్ల విషయానికి వస్తే కుల్దీవ్ యాదవ్ తో పాటు చాహల్ ను ఎంపిక చేశారు

 


అనుభవానికి పెద్దపీట...
జట్టు కూర్పును బట్టి చూస్తే అనుభవానికే సెలక్టర్లు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. ప్రపంచకప్ ఇంగ్లాండ్‌లోని కఠిన పిచ్‌లపై జరగతుండటమే కారణమంటున్నారు క్రీడా విశ్లేషకులు.

 


టీమిండింయా ఇదే..! 
 


*విరాట్ కోహ్లి (కెప్టెన్)
*రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్)
*శిఖర్ ధావన్
*కేఎల్ రాహుల్ (రిజర్వ్ ఓపెనర్)



 *మహేంద్రసింగ్ ధోని (వికెట్ కీపర్)
 *దినేశ్ కార్తీక్ (రెండో వికెట్ కీపర్), 


*విజయ్ శంకర్
*కేదార్ జాదవ్,


*చాహల్,
*హార్దిక్ పాండ్య,
*రవీంద్ర జడేజా, 
*కుల్దీప్ యాదవ్, 


*భువనేశ్వర్ కుమార్, 
*జస్‌ప్రీత్ బుమ్రా, 
* మహ్మద్ షమీ 


మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలు కానుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 5న దక్షిణాఫ్రికాతో కోహ్లీసేన తొలి మ్యాచ్ ఆడనుంది. అలాగే జూన్ 16న మన కోహ్లీసేన పాకిస్థాన్‌తో  ఢీకొట్టనుంది. వాస్తవానికి ప్రపంచకప్ కోసం జట్టుని ప్రకటించే గడువు ఈ నెల 23 వరకూ ఐసీసీ ఇచ్చింది. కానీ వారం ముందే భారత్ ప్రకటించడం విశేషం. గడువులోపు ఐసీసీ అనుమతి లేకుండానే జట్టులో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది.