India’s Asia Cup 2023 squad announcement: ఆసియా కప్‌కు ఎంపికైన టీమ్ ఇండియా ఇదే, తిలక్ వర్మకు స్థానం
India’s Asia Cup 2023 squad announcement : ఎట్టకేలకు నిరీక్షణ తొలగింది. ఆసియా కప్ 2023 టీమ్ ఇండియాను బీసీసీఐ ప్రకటించింది. మరో పదిరోజుల్లో ప్రారంభం కానున్న ఆసియా కప్ టోర్నీకు 17 మందిని సిద్ధం చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
India’s Asia Cup 2023 squad announcement : ఆసియా కప్ 2023కు టీమ్ ఇండియా సిద్ధమైంది. ప్లేయింగ్ 17 జట్టును బీసీసీఐ కాస్సేపటి క్రితం ఎంపిక చేసింది. హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ స్థానం సంపాదించగా గాయాలతో జట్టుకు దూరమైన కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ తిరిగి ఎంట్రీ ఇస్తున్నారు. ఆగస్టు 30 నుంచి ఆసియా కప్ 2023 ప్రారంభం కానుంది.
ఆసియా కప్ 2023 టీమ్ ఇండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఇవాళ ఢిల్లీలో జరిగిన బీసీసీఐ సెలెక్షన్ కమిటీ సమావేశంలో 17మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. సంజూ శామ్సన్‌ను బ్యాకప్ కోసం 18వ ఆటగాడిగా సిద్ధం చేశారు. బీసీసీఐ ఛీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఇతర సెలెక్షన్ కమిటీ సభ్యులు 17 మందితో కూడిన టీమ్ ఇండియాను ఎంపిక చేశారు. వెస్టిండీస్ సిరీస్‌లో అదరగొట్టిన హైదరాబాద్ ఆటగాడు తిలక్ వర్మ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. గాయాల కారణంగా ఆటకు దూరంగా ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్‌లు తిరిగి స్థానం సంపాదించుకున్నారు. సంజూ శామ్సన్‌ను బ్యాకప్ కోసం తీసుకున్నారు.
2023 ఆసియా కప్ శ్రీలంక, పాకిస్తాన్ వేదికగా హైబ్రిడ్ మోడల్‌లో జరగనుంది. ఆగస్టు 30న పాకిస్తాన్ వర్సెస్ నేపాల్ మ్యాచ్‌తో టోర్నీ ప్రారంభం కానుంది. ఇండియా తొలి మ్యాచ్ పాకిస్తాన్‌తో సెప్టెంబర్ 2న జరగనుంది. అయితే ప్లేయింగ్ 11లో ఎవరుంటారనేది ఇంకా తెలియదు.ప్రసిద్ధ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, సిరాజ్ ప్లేయింగ్ 11కు దూరంగా ఉండవచ్చు. ఇక బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ ఇద్దరిలో ఒకరికే స్థానం లభించవచ్చు. ఇషాన్ కిషన్ కంటే సూర్యకుమార్ యాదవ్‌కు తుది జట్టులో ఆడే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి.
ఆసియా కప్ 2023 టీమ్ ఇండియా జట్టు ఇదే
రోహిత్ శర్మ ( కెప్టెన్ ) , శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, శ్రేయస్ అయ్యర్, సూర్య కుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ, ప్రసిద్ధ కృష్ణ, సంజూ శామ్సన్ ( బ్యాకప్)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook