INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్ క్రికెట్లో మన అమ్మాయిలకు స్వర్ణం దక్కేనా..? రేపే తుది పోరు..!
INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. రేపు ఫైనల్ మ్యాచ్‌లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి.
INDW vs AUSW: కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించేందుకు భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. రేపు(ఆదివారం) తుది పోరులో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్టనుంది. భారత కాలమాన ప్రకారం సాయంత్రం 5 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. సెమీస్‌లో సాధించిన అద్భుత విజయాన్నే ఫైనల్‌లో నమోదు చేయాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. రికార్డుల పరంగా భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయిగా ఉంది.
ఇప్పటివరకు తలపడిన ప్రతిసారి ఆస్ట్రేలియా జట్టే ఎక్కువసార్లు విజయం సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో జూన్ 29న జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆసీస్ మహిళల జట్టే గెలిచింది. భారత్ నిర్దేశించిన 154 పరుగుల లక్ష్యాన్ని ఏడు వికెట్లు కోల్పోయి చేధించింది. మళ్లీ అదే జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి. 2003లో పురుషుల క్రికెట్‌లోనూ ఇదే జరిగింది. అప్పట్లో లీగ్ దశలో భారత్, ఆస్ట్రేలియా రెండు సార్లు తలపడితే..రెండుసార్లు ఆసీస్ గెలిచింది. మళ్లీ ఫైనల్‌లో తలపడితే కంగారు జట్టే విజయ ఢంకా మోగించింది.
ఇప్పుడు అదే పరిస్థితి కామన్వెల్త్ గేమ్స్‌లో నెలకొంది. భారత్, ఆస్ట్రేలియా జట్లు ఓడినా..గెలిచినా పతకం రానుంది. ఐతే భారత ఆటగాళ్లు స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్ సూపర్ ఫామ్‌లో ఉన్నారు. వారికి మరికొంత మంది ప్లేయర్లు తోడు అయితే టీమిండియాకు విజయం వరించడం ఖాయంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో రేణుకా సింగ్ అద్భుతంగా రాణిస్తోంది. ఈమ్యాచ్‌లో భారత్ గెలిస్తే..చరిత్రలో నిలిచిపోనుంది. కామన్వెల్త్‌లో క్రికెట్‌ను ప్రవేశ పెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా నిలవనుంది. మొత్తంగా ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగనుంది.
Also read:Rashmika Mandanna: దూసుకెళ్తున్న హీరోయిన్ రష్మిక..రెమ్యునరేషన్ తెలుస్తే అంతా షాకే..!
Also read:IND vs WI: నేడు భారత్, వెస్టిండీస్ మధ్య చివరి టీ20 మ్యాచ్..రిజర్వ్ బెంచ్‌కు అవకాశం ఉంటుందా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook