CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత ఆటగాళ్లు దూసుకెళ్తున్నారు. రోజు రోజుకు పతకాల సంఖ్య పెరుగుతోంది. తాజాగా క్రికెట్‌లో పతకం ఖాయమయ్యింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 6, 2022, 07:23 PM IST
  • కామన్వెల్త్ గేమ్స్‌
  • ఫైనల్‌కు భారత్
  • టీమిండియాకు పతకం ఖాయం
CWG 2022: అదరగొట్టిన భారత అమ్మాయిలు..కామన్వెల్త్‌ ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమిండియా..!

CWG 2022: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జోరు కొనసాగుతోంది. ఇప్పటికే పట్టికలో పతకాల సంఖ్య రెట్టింపు అవుతోంది. తాజాగా క్రికెట్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. కామన్వెల్‌లో తొలిసారి జరుగుతున్న మహిళల క్రికెట్‌లో మన అమ్మాయిలు అదరగొట్టారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో సమిష్టిగా రాణించారు. సెమీస్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. 

భారత ఓపెనర్ స్మృతి మంధాన అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. 32 బంతుల్లో 61 పరుగులు చేసింది. ఇందులో 8 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. మిగతా ప్లేయర్లు తలోచేయి వేయడంతో భారీ స్కోర్‌ను నమోదు చేసింది. లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 160 పరుగులు సాధించింది. దీంతో భారత్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు బాగానే ఆడిన జట్టును గెలిపించుకోలేకపోయారు.

ఇంగ్లండ్ ఆటగాళ్లు స్కివెర్ 41, వ్యాట్ 35, జోన్స్ 31, డంక్లే 19, కాప్సీ 13, సోఫీ 7 బౌచిర్ 4 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో స్నేహ్‌ రాణా 2, దీప్తి శర్మ ఒక వికెట్ తీశారు. టీమిండియా ఫైనల్‌కు చేరడంతో పతకం ఖాయమైంది. రెండో సెమీస్‌లో గెలిచిన జట్టుతో భారత్ ఫైనల్ ఆడనుంది.

Also read:Corona Updates in India: దేశంలో కరోనా కలవరం..కీలక ఆదేశాలు జారీ చేసిన కేంద్ర ప్రభుత్వం..!

Also read:CM KCR: ఇక కేంద్రంతో యుద్దమే..సీఎం కేసీఆర్ స్పష్టీకరణ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News