India Women won 2nd T20I in Super Over against Australia Women: చివరి బంతి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన ఉత్కంఠ భరిత మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన రెండో టీ20లో భారత్ సూపర్ ఓవర్‌లో విజయాన్నందుకుంది. డీవై పాటిల్‌ స్టేడియంలో ఉత్కంఠగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇరు జట్లు స్కోర్లు సమం కావడంతో.. సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో రిచా ఘోష్, స్మృతి మంధాన సూపర్ బ్యాటింగ్‌తో భారత్ ఒక వికెట్ నష్టానికి 20 రన్స్ చేసింది. అనంతరం రేణుకా సింగ్ 16 పరుగులే ఇవ్వడంతో ఆస్ట్రేలియా ఓడిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

రెండో టీ20లో మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. కెప్టెన్ అలిస్సా హీలీ (25) ధాటిగా ఆడే క్రమంలో త్వరగానే ఔట్ అయింది. ఓపెనర్ బెత్ మూనీ (82 నాటౌట్; 54 బంతుల్లో 13 ఫోర్లు), స్టార్ బ్యాటర్ తహిల మెక్‌గ్రాత్ (70 నాటౌట్; 51 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్‌) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో దీప్తి శర్మకు ఓ వికెట్ దక్కింది.


అనంతరం భారీ లక్ష్య చేధనకు దిగిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేశారు. ఓపెనర్ స్మృతి మంధాన (79; 49 బంతుల్లో 9 ఫోర్లతో 4 సిక్స్‌లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. మరో ఓపెనర్ షఫాలీ వర్మ (34; 4 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (21; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. ఇన్నింగ్స్ చివర్లో రిచా ఘోష్ ( 26 నాటౌట్; 13 బంతుల్లో 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన సమయంలో 19వ ఓవర్ వేసిన హీథర్ గ్రహమ్ ఒక వికెట్ తీసి 4 పరుగులే ఇచ్చింది. చివరి ఓవర్‌లో భారత్ విజయానికి 13 పరుగులు అవసరం అయ్యాయి. దేవికా వైద్య రెండు బౌండరీలు బాదడంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఆసీస్‌ బౌలర్లలో హీథెర్‌ గ్రహమ్‌ 3 వికెట్లు పడగొట్టింది.



సూపర్ ఓవర్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ ఒక వికెట్ నష్టానికి 20 రన్స్ చేసింది. అనంతరం ఆస్ట్రేలియా ఒక వికెట్ నష్టానికి 16 రన్స్ చేసి ఓడిపోయింది. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన స్మృతి మంధానకు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు టీ20ల సిరీస్‌‌ 1-1తో సమమైంది. మూడో టీ20 బుధవారం జరగనుంది.


Also Read: మా దేశం తరఫున బరిలోకి దిగితే.. అన్ని మ్యాచుల్లో ఆడిస్తాం! సంజూ శాంసన్‌కు బంపర్‌ ఆఫర్‌


Also Read: Telangana Rains: మాండౌస్ తుపాను ఎఫెక్ట్.. తెలంగాణలో మరో 2 రోజుల పాటు మోస్తరు వర్షాలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.