England captain Heather Knight reacts on Deepti Sharma-Charlie Dean Run Out: ఇంగ్లండ్, భారత్ మహిళల జట్ల మధ్య మూడో వన్డేలో జరిగిన మన్కడింగ్‌ (రనౌట్‌) వివాదం రోజురోజుకు తీవ్ర స్థాయికి చేరుకుంటోంది. ఇంగ్లండ్‌ బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత బౌలర్‌ దీప్తి శర్మ రనౌట్‌ చేసిన తీరుపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతొంది. దీప్తి శర్మ బంతి వేయకముందే.. డీన్‌ క్రీజ్‌ దాటడంతో నిబంధనల ప్రకారం భారత బౌలర్ ఇంగ్లీష్ బ్యాటర్‌ను రనౌట్‌ చేసింది. అయినా కూడా క్రీడాస్ఫూర్తి అంశం తెరపైకి వచ్చింది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం.. మన్కడింగ్‌ను రనౌట్‌ విభాగంలో చేర్చిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ వివాదంపై టీమిండియా బౌలర్‌ దీప్తి శర్మ స్పందిస్తూ.. అప్పటికే చాలాసార్లు ఛార్లీ డీన్‌ను హెచ్చరించామని, అయినా కూడా ఆమె తీరు మారలేదని ఓ వీడియోలో చెప్పింది. 'రనౌట్‌ విషయంలో మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఛార్లీ డీన్‌ మళ్లీమళ్లీ క్రీజ్‌ దాటి ముందుకు వెళ్లింది. ఈ విషయాన్ని అంపైర్లకు కూడా ఫిర్యాదు చేశాం. అయినా కూడా ఛార్లీ తన తీరు మార్చుకోలేదు. నిబంధనల ప్రకారమే ఆమెను ఔట్ చేశాం' అని దీప్తి శర్మ పేర్కొంది. మరోవైపు భారత మహిళా కెప్టెన్  హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ కూడా ఇప్పటికే వివరణ ఇచ్చింది. 



రనౌట్‌ వివాదంపై ఇంగ్లండ్ మహిళల జట్టు కెప్టెన్ హీథర్‌ నైట్ స్పందించింది. రనౌట్‌ గురించి మమ్మల్ని హెచ్చరించారనడంలో వాస్తవం లేదన్నారు. దీప్తి శర్మ అబద్దాలాడుతోందని పరోక్షంగా అంటోంది. 'మ్యాచ్‌ అయిపొయింది. నిబంధనల ప్రకారమే.. చార్లీ ఔట్ అయింది. మ్యాచ్‌తో పాటు సిరీస్‌ గెలిచేందుకు భారత్‌కు అర్హత ఉంది. అయితే రనౌట్‌ విషయంలో మమ్మల్ని హెచ్చరించారనడంలో మాత్రం వాస్తవం లేదు. నిజానికి భారత జట్టు చేసింది తప్పు కాదు కాబట్టి.. హెచ్చరించాల్సిన అవసరం లేదు. తాము చేసిన దానిని సమర్థించుకోవడం కోసం హెచ్చరిక అనే ఒక పదాన్ని వాడుకోకూడదు' అని హీథర్‌ నైట్ పేర్కొన్నారు. 


Also Read: Faria Abdullah in SSMB28: మహేష్ బాబుతో చిట్టి.. అసలు క్లారిటీ వచ్చేసిందిగా!


Also Read: భారత మహిళా క్రికెట‌ర్‌ తానియా భాటియాకు చేదు అనుభవం.. అగంతకుడు రూమ్‌లోకి దూరి..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.      


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook