ఐపీఎల్-11: రషీద్ సంచలనం.. ఫైనల్‌కు సన్‌రైజర్స్
టీ-20 లీగ్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది.
టీ-20 లీగ్ 11వ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫైనల్లోకి ప్రవేశించింది. చెన్నైతో తొలి క్వాలిఫయర్లో చేతిలో ఉన్న మ్యాచ్‌ను చేజార్చుకున్న హైదరాబాద్..ఈసారి చేజారిపోతున్న మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతాతో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్ లో 13 పరుగుల తేడాతో విజయం సాధించి తుది పోరుకు సిద్ధమైంది. రషీద్ ఖాన్ మూడు వికెట్లతో కీలక పాత్ర పోషించగా.. సిద్దార్థ్ కౌల్, బ్రాత్‌వైట్‌లు చెరో రెండు వికెట్లు తీశారు.
మొదట సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. అనంతరం 175 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్(KKR-కోల్‌కతా నైట్‌రైడర్స్ )ను 161/9 పరుగులకే ఎస్ఆర్‌హెచ్(SRH-సన్‌రైజర్స్ హైదరాబాద్) బౌలర్లు రషీద్ (3/19), సిద్దార్థ్ కౌల్ (2/32), బ్రాత్‌వైట్ (2/15) కట్టడి చేశారు. ఓపెనర్లు క్రిస్ లిన్ (48; 31 బంతుల్లో 6×4, 2×6), సునీల్ నరైన్ (26; 13 బంతుల్లో 4×4, 1×6)మినహా ఎవ్వరూ ఆడలేదు. హైదరాబాద్ విజయంలో రషీద్ ఖాన్ (34 నాటౌట్; 10 బంతుల్లో 2×4, 4×6, 3 వికెట్లు, 2 క్యాచ్‌లు) కీలకపాత్ర పోషించాడు. సన్‌రైజర్స్‌కు ఆశలే లేని స్థితిలో కీలక వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. కాగా అటు బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన రషీద్ ఖాన్‌కు మ్యాచ్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ నెల 27న ఆదివారం ముంబాయిలో జరిగే ఫైనల్లో సీఎస్‌కే(CSK-చెన్నై సూపర్ కింగ్స్ )తో ఎస్ఆర్‌హెచ్(SRH-సన్‌రైజర్స్ హైదరాబాద్) అమీతుమీ తేల్చుకోనుంది.