సీజన్లో తొలి విజయం అందుకున్న ముంబై జట్టు
వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ముంబై: వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో బెంగళూరు జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా, తొలుత బెంగళూరు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ చేసిన ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లకు గాను ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. అయితే, ముంబై నిర్దేశించిన 214 పరుగుల విజయ లక్ష్యంతో బరిలో బెంగళూరు జట్టు బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేయగా.. 46 పరుగుల తేడాతో బెంగళూరు జట్టుపై ముంబై జట్టు విజయం సాధించి.. ఈసీజన్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది.
ఆర్సీబీ ఇన్నింగ్స్‌లో విరాట్ కోహ్లి(92 నాటౌట్; 62 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు) మినహా ఎవరూ రాణించకపోవడంతో ఆ జట్టుకు ఘోర ఓటమి తప్పలేదు. ముంబై బౌలర్లలో కృనాల్ పాండ్యా మూడు వికెట్లతో మెరవగా, మెక్లీన్‌గన్, బుమ్రాలకు తలో రెండు వికెట్లు లభించాయి. ఇక మయాంక మార్కండే వికెట్ తీశాడు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (94;52 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడగా, అతనికి జతగా ఓపెనర్ లూయిస్(65; 42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగి ఆడాడు. చివర్లో హార్దిక్ పాండ్యా 5 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో అజేయంగా 17 పరుగులు సాధించాడు.