RR vs KKR, IPL 2020 : రాజస్తాన్‌ను రఫ్ఫాడించిన కోల్‌కతా నైట్ రైడర్స్
RR vs KKR match highlights: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు చేతిలో Rajasthan Royals 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టేన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకోవడంతో Kolkata knight Riders జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ( Shubman Gill)...
RR vs KKR match highlights: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా బుధవారం రాత్రి రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు చేతిలో Rajasthan Royals 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ కెప్టేన్ స్టీవ్ స్మిత్ బౌలింగ్ ఎంచుకోవడంతో Kolkata Knight Riders జట్టు తొలుత బ్యాటింగ్‌కి దిగింది. కోల్‌కతా ఆటగాళ్లలో శుభ్‌మన్ గిల్ ( Shubman Gill ) 47 పరుగులు ( 34 బంతుల్లో 4x5, 6x1 ), ఇయాన్ మోర్గాన్ ( Eoin Morgan ) 34 పరుగులు (23 బంతుల్లో 4x1, 6x2) తప్ప మిగతా ఆటగాళ్లు పెద్దగా రాణించలేదు.
మరో ఓపెనర్ సునిల్ నరైన్ (15), నితీశ్ రానా (22), ఆండ్రూ రసెల్ (24) పరుగులు సాధించగా ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టేన్ దినేష్ కార్తిక్ (1) 3 బంతులకే జోఫ్రా బౌలింగ్‌లో జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కి చేరాడు. మొత్తంగా కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి 174 పరుగులు చేయగలిగింది. 175 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆరంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. Also read : Suresh Raina: ఐపీఎల్‌లో సురేష్ రైనాకు ఛాన్స్ లేదు!
Rajasthan Royals ఓపెనర్ స్టీవ్ స్మిత్ (3) 15 పరుగులకే ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ ( Sanju Samson ) కేవలం 8 పరుగులకే క్యాచ్ అవుట్ అయి పెవిలియన్ బాటపట్టాడు. చివరి రెండు మ్యాచ్‌ల్లో చెలరేగిపోయి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్న సంజూ శాంసన్ ఈ మ్యాచ్‌లో సింగిల్ డిజిట్‌కే వెనుతిరగడం ఆ జట్టును తీవ్ర నిరాశకు గురిచేసింది. మరో ఓపెనర్ జోస్ బట్లర్ (21) ( Jos Butler ) కూడా స్వల్ప స్కోర్‌కే ఔట్ అవ్వడం రాజస్థాన్ టాప్ ఆర్డర్‌ని దెబ్బతీసింది.
ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన రాబిన్ ఊతప్ప ( Robin Uthappa ), రియాన్ పరాగ్‌లు కూడా అలా వచ్చి ఇలా వెనుతిరగడంతో 42 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక్కడే రాజస్థాన్ జట్టు విజయావకాశాలను కోల్పోయింది. చివర్లో వచ్చిన టామ్ కుర్రాన్ ( Tom Curran ) ( 36 బంతుల్లో 54 పరుగులు ) మినహా ఎవ్వరూ పెద్దగా రాణించకపోవడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు 137 పరుగులకే ఆటను ముగించాల్సి వచ్చింది. Also read : Shreyas Iyer: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్!
కోల్‌కతా నైట్ రైడర్స్ బౌలర్లలో శివం మావి ( Shivam Mavi ) 4 ఓవర్లలో 20 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. నాగర్‌కోటి, వరుణ్‌లు తలో రెండు వికెట్లు తీయగా, కమిన్స్, సునీల్ నరైన్ కుల్దీప్ యాదవ్‌లు ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe