CSK VS MI: చెన్నైని చిత్తు చేసిన ముంబై
ఐపీఎల్ చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో శుక్రవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. ఈ మ్యాచ్‌తో ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయింది.
IPL 2020: Mumbai Indians hammer Chennai Super Kings by 10 wickets: షార్జా: ఐపీఎల్ (IPL) చరిత్రలో.. గతంలో ఎప్పుడూ ఎదురుకాని పరాభవాన్ని చెన్నై సూపర్ కింగ్స్ చవిచూసింది. ఐపీఎల్ 2020 (IPL 2020) లో శుక్రవారం షార్జా వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ (MI) తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దారుణంగా ఓడిపోయింది. (Mumbai Indians VS Chennai Super Kings) మ్యాచ్ ఆరంభం నాటినుంచి ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 10 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌ను సునాయసంగా గెలిచి ముంబై పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నైసూపర్ కింగ్స్ పాతాళానికి పడిపోయి.. ప్లే ఆఫ్ రేసు ఆశలను కూడా చేజార్చుకుంది. శుక్రవారం ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. స్యామ్ కరన్ (47 బంతుల్లో 52; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రమే అర్ధసెంచరీ స్కోరు చేయగా.. అందరూ విఫలమయ్యారు. స్యామ్ కరన్ కారణంగానే చెన్నై ఆమాత్రం పరుగులు చేయగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (4/18) ప్రత్యర్థి జట్టు చెన్నైని కుప్పకూల్చాడు. అనంతరం ముంబై 12.2 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 116 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (37 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 5 సిక్సర్లు), డికాక్ (37 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయంగా నిలిచారు.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ధోని సేన బౌల్ట్, బుమ్రా బౌలింగ్ ధాటికి తట్టుకోలేకపోయారు. కొందరు డగౌట్ కాగా.. మరికొందరు 10కి తక్కువగానే స్కోర్ చేసి పెవిలియన్ బాట పట్టారు. రుతురాజ్ గైక్వాడ్ (0), జగదీశన్ (0), అంబటి రాయుడు (2), డుప్లెసిస్ (1), జడేజా (7) మాత్రమే స్కోరు సాధించారు. అయితే 6 ఓవర్లకు జట్టు 24 పరుగులు చేసి 5 వికెట్లను పొగొట్టుకుంది. ఐపీఎల్ కెరీర్‌లో రెండోసారి రెండో ఓవర్లోనే బ్యాటింగ్‌కు వచ్చిన ఎంఎస్ ధోని (16 బంతుల్లో 16; 2 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే కొట్టి.. రాహుల్ చహర్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో చైన్నై 114 మాత్రమే చేసింది. Also read: Prabhas Birthday: ‘రాధే శ్యామ్’ స్టన్నింగ్ సర్‌ప్రైజ్ ఇదే..
లక్ష్య ఛేదనలో ముంబైకి ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. ఓపెనర్లు ఇషాన్ కిషన్ (68) డికాక్ (37) ఇద్దరే మ్యాచ్‌ను సునాయసంగా గెలిపించారు. విరిద్దరినీ చెన్నై బౌలర్లు ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ప్రారంభం నుంచి మంచి ఫామ్‌తో ఆడిన ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్లు చకచకా పరుగులు చేసి ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా కేవలం 12.2 ఓవర్లలో వికెట్ 116 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలిపించారు. ఇదిలాఉంటే.. ఎడమకాలి కండరాల గాయంతో ముంబై జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అతని స్థానంలో కీరన్ పొలార్డ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. Also read: Tamil Nadu: బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ఐదుగురు సజీవ దహనం
ఇదిలాఉంటే.. ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలతో ముంబై ఇండియన్స్ జట్లు అగ్రస్థానానికి చేరుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ 11 మ్యాచ్‌లు ఆడి కేవలం మూడు విజయాలనే సాధించి పాయింట్ల పట్టికలో పాతాళానికి పడిపోయింది. Also read: Tuck Jagadish shooting re-started: టక్ జగదీష్ షూటింగ్ మళ్లీ స్టార్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe