RCB vs PBKS Final Match: పొట్టి ప్రపంచ క్రికెట్‌లో అతి భారీ టీ20 లీగ్ అయిన ఐపీఎల్ ఆఖరి అంకానికి చేరింది. లక్షకు పైగా సీటింగ్ సామర్థ్యం కలిగిన గుజరాత్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నేడు జరిగే ఫైనల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి.
IPL 2025 MI vs PBKS Qualifier-2: ఐపీఎల్ 2025 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ తప్పుకుంది. అద్భుతమైన ప్రదర్శనతో క్వాలిఫయర్ 2 వరకు వెళ్లిన ఆ జట్టుకు పంజాబ్ కింగ్స్ ఊహించని విధంగా షాకిచ్చింది. ఆదివారం అహ్మాదాబాద్ వేదికగా జరిగిన క్వాలిఫయిర్ 2లో రాణించిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో ముంబైను ఓడించింది. శ్రేయస్ అయ్యర్ విధ్వంసకర బ్యాటింగ్ తో పంజాబ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు.
IPL 2025 RCB vs LSG: ఐపీఎల్ 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో లక్నోపై జితేష్ శర్మ 33 బంతుల్లో 85 పరుగులు చేయడంతో ఆర్సీబీ టాప్-2లో నిలిచింది. అయితే మ్యాచు సమయంలో దిగ్వేష్ రాఠి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో జితేష్ శర్మను మన్కడ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ కెప్టెన్ రిషబ్ పంత్ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అప్పీల్‌ను విత్ డ్రా చేసుకున్నాడు. అయితే ఈ చర్యపై విరాట్ కోహ్లీ చాలా గుస్సా అయ్యాడు.
Rishabh Pant's cost per run in IPL 2025: IPL 2025 చివరి లీగ్ మ్యాచ్‌లో రిషబ్ పంత్ 54 బంతుల్లో అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఇది అతని ఐపీఎల్ కెరీర్‌లో రెండవ సెంచరీ. లక్నో తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ ఇదే. కానీ ఈ సీజన్ పంత్ కు అంతగా కలిసి రాలేదు. ఈ సీజన్‌లో పంత్ ఒక్క పరుగుకు ఎంత ఖర్చయిందో తెలుసా?
IPL 2025: ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయిర్ సూర్యకుమార్ యాదవ్ సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ లో రెండు సీజన్లలో 600, అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ముంబై ఇండియన్స్ ఆటగాడికి రికార్డ్ క్రియేట్ చేశాడు. అంతకుముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికాకు చెందిన టెంబా బావుమా పేరిట ఉండేది.
IPL 2025 Zaheer Khan and Virat Kohli: ఐపీఎల్ 2025 చివరి దశలో RCB జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడటానికి లక్నో చేరుకుంది. ఇక్కడ రెండు జట్ల మధ్య మే 27న మ్యాచ్ జరగనుంది. మ్యాచ్‌కు ముందు.. విరాట్ కోహ్లీ, LSG మెంటర్ జహీర్ ఖాన్ మధ్య జరిగిన భావోద్వేగ క్షణం కెమెరాకు చిక్కింది. ఈ వీడియోలో జహీర్ ఖాన్ తన కుమారుడి ఫొటోను కోహ్లీ చూపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Vaibhav Suryavanshi: గుణవంతుడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడు ఇలా ఇవన్నీ ఒకే పోలిక ఉన్న పదాలు. అయినప్పటికీ ఏ పదానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంది. ఇతరుల పట్ల గౌరవభావంత ఉంటూ, పెద్దలను గౌరవించడం మొదలు, చెడు అలవాట్లు లేకపోతే అలాంటి వ్యక్తిని సంస్కారవంతుడని కితాబు ఇస్తుంటాం. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే..మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన IPL 2025లో జరిగిన ఓ ఘటన అందరి హృదయాలను గెలుచుకుంది. మ్యాచ్ తర్వాత ఎంఎస్ ధోని పాదాలను వైభవ్ సూర్య వంశీ తాకడం..పెద్దల పట్ల ఆయనకు ఉన్న సంస్కారాన్ని తెలుపుతుంది.
IPL 2025 Lucknow Supergiants Record: హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల తేడాతో ఓడిన లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి నష్టదాయకంగా ఉన్నప్పటికీ, జట్టులోని విదేశీ బ్యాట్స్‌మెన్ తమ పేరిట ఒక ప్రత్యేకమైన రికార్డును క్రియేట్ చేసుకున్నారు. ఈ సీజన్‌లో ఏ ఫ్రాంచైజీ తరపున అయినా అత్యధిక పరుగులు చేసిన తొలి విదేశీ LSG ఆటగాళ్లుగా మార్క్రమ్, మార్ష్, పూరన్ నిలిచారు.
IPL 2025: సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఓటమి పాలైంది. లక్నో జట్టుకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి, కానీ వాటిని గెలిచినా ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకోలేకపోతుంది. అభిషేక్ శర్మ మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. ఇషాన్ కిషన్, క్లాసెస్, కమిందు మెండీస్ రాణించడంతో హైదరాబాద్ అద్భుత విజయాన్ని అందుకుంది.
Good Professional Cricketer: క్రికెట్ అంటే చాలా మందికి ఇష్టం. అందులోనూ మనదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరంలేదు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ నడుస్తోంది. క్రికెట్ ఫ్యాన్స్ కు ఇది పండగే. అయితే క్రికెట్ చూడటమే కాదు..ఆడటంతోపాటు క్రికెట్లో వృత్తిపరంగా చేరాలనుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాంటి వారి కోసం భారత మాజీ కెప్టెన్ , ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ కొన్ని టిప్స్ సూచించారు. అవేంటో చూద్దాం.
IPL 2025 Latest Updates: ఐపీఎల్ 2025 నుంచి ప్రారంభంకానుండగా.. ఆర్‌సీబీకి అదిరిపోయే గుడ్‌న్యూస్. పేసర్ జోష్ హేజెల్‌వుడ్ మళ్లీ జట్టుతో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
IPL: పాకిస్తాన్ తో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ తో పాకిస్థాన్ ప్యాంట్లు తడిచిపోయాయి. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్ తో పాకిస్థాన్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ భారత్ జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లపై పడింది.
Yuzvendra Chahal Salary: అంతర్జాతీయ క్రికెట్లో హ్యాట్రిక్ లకు కేరాఫ్ అడ్రస్ యుజ్వేంద్ర చాహల్. మైదానంలోకి అడుగుపెట్టాడంటే అదుర్స్ అనిపించుకోవాల్సిందే. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచులో యుజ్వేంద్ర హ్యాట్రిక్ వికెట్లతో చెలరేగిపోయాడు. అతని ఖాతాలో ఇలాంటి రికార్డులు ఎన్నో ఉన్నాయి. మైదానంలోనే కాదు ఆదాయపు నన్ను అధికారిగా విధులు నిర్వహిస్తున్నాడు. చాహల్ బీసీసీఐ, ఐపీఎల్ నుంచి పొందే జీతంతో పాటు, ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కూడా మంచి జీతం పొందుతున్నాడు.
Vaibhav Suryavanshi: ఏంటా దూకుడు..ఏంటీ ఆ బ్యాటింగ్ విజ్రుంభన..పిల్లాడివి కాదు..చిచ్చర పిడుగువు..సింహంలా గర్జిస్తూ..పిడుగల్లే ఊరిమావు..ఇది ఎవరి గురించో కాదు..14ఏళ్ల వయసులో క్రికెట్ దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచిన వైభవ్ సూర్యవంశీ గురించి. 14ఏళ్లకే ఐపీఎల్ లో సెకండ్ ఫాస్టెస్ సెంచరీ..యంగెస్ట్ సెంచూరియన్..గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ వైభవ్ ఉచకోతతో రికార్డులు బద్దలయ్యాయి. తాజాగా 10ఏళ్ల వయస్సులో వైభవ్ సూర్యవంశీ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. బాల్యం నుండి కష్టపడి పనిచేయడం, అంకితభావం ఎలా ఉందో అర్థమవుతోంది.
SRH Play Off: హాట్ ఫెవరెట్ టీమ్ గా బరిలోకి దిగిన SRH సన్ రైజర్స్ హైదరాబాద్ కి ప్లే ఆఫ్ రేసు ఆశలు ముగిసినట్టే కనపడుతోంది. పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో 245 పరుగుల భారీ స్కోరును చేధించి ప్లే ఆఫ్ రేసులో నిలిచింది. కానీ ముంబైతో జరిగిన మ్యాచ్ లో ఓడిపోయి, ప్లే ఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప, SRH ప్లే ఆఫ్ కు చేరుకోవడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు.
Mayank Yadav Re Entry: లక్నో సూపర్ జెయింట్స్‌తో స్పీడ్ స్టార్ మయాంక్ యాదవ్ చేరాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న మయాంక్.. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నాడు. మయాంక్ పురాగమనానికి సంబంధించి లక్నో టీమ్ ఓ వీడియోను రిలీజ్ చేసింది.
Sunrisers Hyderabad Second Defeat Against Delhi Capitals: ఐపీఎల్‌లో ఆరంభ మ్యాచ్ అద్భుతంగా ఆడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఏమైంది? వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఓటమిని పొందింది. ఢిల్లీ చేతుల్లో చిత్తుచిత్తుగా ఓడడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
SRH vs LSG: ఐపీఎల్ లో 17 సీజన్లు కంప్లీట్ అయ్యాయి. ఎన్నో మ్యాచులు జరిగాయి. ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి.కానీ ఎప్పుడు ఇలాంటి చర్చ జరగలేదు. ఈ జట్టు గెలుస్తుందా. ఆ జట్టు నెగ్గుతుందా..ప్లే ఆఫ్స్ కు వెళ్తారా. చివరికి ఏ జట్టు టైటిల్ గెలుచుకుంటుంది ఇలాంటి విశ్లేషనలే ఇప్పటి వరకు కనిపించాయి. కానీ ఇప్పుడు 300 స్కోర్ పై చర్చ షురూ కావడం ఇదే తొలిసారి. ఎందుకంటే ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ కుమ్మేయడం మనం చూశాం. మళ్లీ నేడు అలాంటి దూకుడు చూపించేందుకు ఆ జట్టు రెడీగా ఉంది. ఈ మ్యాచ్ కోసం తెలుగు వారే కాదు..క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
RR vs KKR: ఈ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్ 2025 మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఏకపక్షంగా గెలిచి KKR జట్టు తన విజయ ఖాతాను తెరిచింది. ఈ మ్యాచ్‌లో, KKR 152 పరుగుల లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే సాధించింది.
IPL 2025: ఐపీఎల్ 18వ సీజన్ లో తొలి విజయంపై భారీ ఆశలు పెట్టుకున్న రాజస్థాన్ రాయల్స్ పీకల్లోతు కష్టాల్లో పడింది. ధాటిగా ఇన్నింగ్స్ మొదలుపెట్టి ఆ జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. కోల్ కతా కెప్టెన్ రహానే స్పిన్నర్లను రంగంలోకి దింపడంతో పీకల్లోతు కష్టాల్లో పడింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.