ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో తొలిసారిగా అద్భుతం జరిగింది. లీగ్ చరిత్రలో ఒకేరోజు రెండు మ్యాచ్‌లు టై అయ్యాయి. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (Kings XI Punjab), ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో మరింత నాటకీయత చోటుచేసుకుంది. సూపర్ ఓవర్ సైతం టై కావడంతో మరో సూపర్ ఓవర్ ఆడాల్సి వచ్చింది. చివరికి తమ పోరాటపటిమతో ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ (Kings XI Punjab) జట్టు రెండో సూపర్ ఓవర్‌లో సునాయాసంగా విజయం సాధించింది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దుబాయ్ వేదికగా జరిగిన ఆదివారం రాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గిన ముంబై ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (53: 43 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ, కీరన్ పొలార్డ్ (34 నాటౌట్: 12 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు), కౌల్టర్ నైల్ (24 నాటౌట్: 12 బంతుల్లో 4 ఫోర్లు) చివర్లో మెరుపులు మెరిపించడంతో 6 వికెట్ల నష్టానికి ముంబై 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యఛేదనలో పంజాబ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ (77: 51 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లు), యూనివర్సల్ బాస్ క్రిస్‌గేల్ (24), నికోలస్ పూరన్ (24), హుడా (23) ఓ మోస్తరుగా ఆడటంతో ఆ జట్టు సైతం 20 ఓవర్లలో సరిగ్గా 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులే చేసింది. మ్యాచ్ టై కావడంతో ఫలితాన్ని తేల్చేందుకు సూపర్ ఓవర్‌ జరిగింది. 



 


తొలి సూపర్ ఓవర్ ఇలా జరిగింది. (First Super Over of KXIP vs MI Match)
పంజాబ్ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. రాహుల్, పూరన్ బ్యాటింగ్‌కు దిగగా, ఎప్పటిలాగే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ.. బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకు బంతి అందించాడు. 
1వ బంతి - కేఎల్ రాహుల్ సింగిల్
2వ బంతి - పూరన్ ఔట్
3వ బంతి - కేఎల్ రాహుల్ సింగిల్
4వ బంతి - హుడా సింగిల్
5వ బంతి - కేఎల్ రాహుల్ 2 రన్స్
6వ బంతి - కేఎల్ రాహుల్ ఔట్
పంజాబ్ 5 పరుగులు చేసింది.


ముంబై బ్యాటింగ్ 
తొలి సూపర్ ఓవర్‌లో పంజాబ్ బౌలర్ మహమ్మద్ షమీ బౌలింగ్ చేశాడు. ముంబై నుంచి రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనర్లుగా వచ్చారు.
1వ బంతి - క్వింటన్ డికాక్ సింగిల్
2వ బంతి -  రోహిత్ శర్మ సింగిల్
3వ బంతి - క్వింటన్ డికాక్ సింగిల్
4వ బంతి - రోహిత్ శర్మ.. డాట్ బాల్
5వ బంతి - రోహిత్ శర్మ సింగిల్
6వ బంతి - క్వింటన్ డికాక్ (1రన్, 2వ రన్ తీస్తూ రనౌట్)
ఛేజింగ్‌లో ముంబై సైతం సరిగ్గా 5 పరుగులు చేయడంతో రెండో సూపర్ ఓవర్‌కు దారి తీసింది.


సూపర్ ఓవర్ 2 ఇలా సాగింది.. (Second Super Over of MI vs KXIP Match)
ముంబై ఆటగాళ్లు హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్ బ్యాటింగ్‌కు దిగారు. పంజాబ్ బౌలర్ జోర్డాన్ బౌలింగ్ చేశాడు.
1వ బంతి - కీరన్ పోలార్డ్ సింగిల్
2వ బంతి - హార్దిక్ పాండ్యా, వైడ్
2వ బంతి - హార్దిక్ పాండ్యా సింగిల్
3వ బంతి - కీరన్ పోలార్డ్, ఫోర్
4వ బంతి - కీరన్ పోలార్డ్, వైడ్
4వ బంతి - కీరన్ పోలార్డ్ (1), పాండ్యా రనౌట్
5వ బంతి - కీరన్ పోలార్డ్, డాట్ బాల్
6వ బంతి - కీరన్ పోలార్డ్ 2 రన్స్
ముంబై 11 పరుగులు చేసింది.


పంజాబ్ బ్యాటింగ్...
క్రిస్‌గేల్, మయాంక్ అగర్వాల్ బ్యాటింగ్‌కు దిగగా, ముంబై బౌలర్ ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్ చేశాడు.
1వ బంతి - క్రిస్‌గేల్, సిక్స్
2వ బంతి - క్రిస్‌గేల్
3వ బంతి - మయాంక్ అగర్వాల్, ఫోర్
3వ బంతి - మయాంక్ అగర్వాల్, ఫోర్
నాలుగో బంతికే 12 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించి రెండో సూపర్ ఓవర్‌లో నెగ్గడంతో ముంబైపై విజయం సాధించింది.  Also Read : Virender Sehwag: ఆ క్రికెటర్ కోవిడ్19 వ్యాక్సిన్ కనిపెట్టగలడు: సెహ్వాగ్ ట్వీట్ వైరల్ 


 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe