IPL 2020: సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు
ఐపీఎల్ 2020 (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్ నరైన్ (Sunil Narine) బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అంపైర్లు.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందంటూ బీసీసీఐకు ఫిర్యాదు చేశారు.
KKR spinner Sunil Narine reported for suspect bowling action: దుబాయ్: ఐపీఎల్ 2020 (IPL) లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) కీలక ఆటగాడు, స్పిన్నర్ సునీల్ నరైన్ (Sunil Narine) బౌలింగ్‌పై మరోసారి ఫిర్యాదు నమోదైంది. ఈ మేరకు అంపైర్లు.. సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ అనుమానస్పదంగా ఉందంటూ బీసీసీఐకు ఫిర్యాదు చేశారు. దుబాయ్‌లో శనివారం కోల్‌కతా నైట్ రైడర్స్, కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ (XI Punjab) జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్‌లో నరైన బౌలింగ్ యాక్షన్ (bowling action) అనుమానాస్పదంగా ఉందని మ్యాచ్ అనంతరం ఆన్‌ఫీల్డ్ అంపైర్లు (on-field umpires ) బీసీసీఐకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేసినింది. ప్రస్తుతం నరైన్‌ను హెచ్చరిక జాబితాలో ఉంచుతున్నామని వెల్లడించింది. ఇప్పటికీ బౌలింగ్ వేయవచ్చని.. మరోసారి నరైన బౌలింగ్ యాక్షన్‌పై ఫిర్యాదు వస్తే ఈ సీజన్ ఐపీఎల్ నుంచి సస్పెండ్ చేస్తామని వెల్లడించింది. ఒకవేళ అలా జరిగితే.. బీసీసీఐ నుంచి క్లియరెన్స్ వచ్చేవరకు నరైన్ బౌలింగ్ వేసే అవకాశమే ఉండదని స్పష్టంచేసింది. Also read: Hathras Case: కేసు నమోదు చేసి.. దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
అయితే బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌తో మెరిసే వెస్టిండీస్ ఆటగాడు సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్‌పై గతంలో కూడా ఫిర్యాదులు వచ్చాయి. 2014లో జరిగిన ఛాంపియన్స్ లీగ్‌లో రెండు సార్లు నరైన్‌పై ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సునీల్ నరైన్ 2015లో జరిగిన ప్రపంచ కప్‌కు దూరమయ్యాడు. అంతేకాదు అదే ఏడాదిలో జరిగిన ఐపీఎల్‌లో కూడా ఇలాంటి ఫిర్యాదులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఫలితంగా ఐసీసీ ఆ ఏడాది నవంబర్‌లో నరైన్‌ను సస్పెండ్ చేసింది. అయితే కోల్‌కతా కీలక ఆటగాడు సునీల్ నరైన్ తన బౌలింగ్ వైఖరిని మార్చుకోకపోతే వేటు తప్పదంటూ పేర్కొంటున్నారు క్రీడాభిమానులు. Also read: Amitabh Bachchan: 78వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ షెహన్‌షా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe