IPL 2020 Playoff Race: కోల్‘కథ’ను సన్‌రైజర్స్ హైదరాబాద్ ముగిస్తుందా?
SRH to Defeat MI to reach IPL 2020 Playoff | సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నేడు అసలుసిసలైన పరీక్ష ఎదురైంది. ఇన్ని రోజులు ఆడిన మ్యాచ్‌లు ఓ ఎత్తయితే నేడు డిఫెండింగ్ ఛాంపియన్‌తో తలపడనున్న మ్యాచ్ మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఎందుకంటే లీగ్‌లో సన్‌రైజర్స్ ముందుకు వెళ్లాలా.. ఇక ఇంటిదారి పట్టాలా నిర్ణయించే మ్యాచ్ ఇది
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderbad)కు నేడు అసలుసిసలైన పరీక్ష ఎదురైంది. ఇన్ని రోజులు ఆడిన మ్యాచ్‌లు ఓ ఎత్తయితే నేడు డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ (Mumbai Indians)తో తలపడనున్న మ్యాచ్ మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఎందుకంటే లీగ్‌లో సన్‌రైజర్స్ ముందుకు వెళ్లాలా.. ఇక ఇంటిదారి పట్టాలా నిర్ణయించే మ్యాచ్ ఇది.
Also Read ; Kapil Dev about Dhoni: ధోనీ ఆటపై కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు
ఒకవేళ ఈ లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయం సాధిస్తే సన్‌రైజర్స్ మూడో స్థానంతో ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. అదే సమయంలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమిస్తుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఆ మ్యాచ్‌లో ఓటమిపాలైతే 14 పాయింట్లతో ఉన్న కేకేఆర్ నాలుగో స్థానంతో ప్లేఆఫ్స్ చేరుకుంటుంది. ముంబై ఇండియన్స్ 18 పాయింట్లతో ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ఖరారు చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
Also Read ; RCB vs DC match: రహానె, ధావన్ అర్థ శతకాలతో ప్లే ఆఫ్స్‌కి చేరిన ఢిల్లీ
సోమవారం జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్తు ఖరారు చేసుకున్న రెండో జట్టుగా నిలిచింది. అయితే 14 పాయింట్లతో ఉన్నప్పటకీ కోల్‌కతా నైట్ రైడర్స్ (-0.214) కన్నా మెరుగైన రన్ రేట్ కారణంగా బెంగళూరు (-0.172) ప్లే ఆఫ్స్ చేరుకున్న మూడో జట్టుగా నిలిచింది. మిగిలిన బెర్త్ కన్ఫామ్ చేసుకోవాలంటే నేటి మ్యాచ్‌లో ముంబైని సన్‌రైజర్స్ ఓడించక తప్పదు.సన్‌రైజర్స్ ఓడితే కోల్‌కతా జట్టు హ్యాపీగా ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటుంది.
Also Read ; ఐపీఎల్ 2020 నుంచి నిష్క్రమించడంపై స్టీవ్ స్మిత్ ఏమన్నాడంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe