ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా జరిగిన 12వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) పై కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) 37 పరుగుల తేడాతో విజయం సాదించడం తెలిసిందే. దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో పూర్తిగా విఫలమైన రాజస్థాన్ లీగ్‌లో తొలి ఓటమిని రుచి చూసింది. ఈ క్రమంలో రాజస్థాన్ ఆటగాడు, మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప (Robin Uthappa) ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) పేరిట ఉన్న చెత్త రికార్డును అధిగమిస్తూ ఆ రికార్డును సొంతం చేసుకోవడం గమనార్హం. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పటివరకూ ఐపీఎల్‌లో అత్యధికంగా 90 ఓటమిపాలైన మ్యాచ్‌లలో కోహ్లీ భాగస్వామిగా ఉన్నాడు. తాజా ఓటమితో ఆ రికార్డును రాబిన్ ఉతప్ప అధిగమించాడు. అత్యధికంగా ఓటమిపాలైన మ్యాచ్‌ జట్టు సభ్యుడిగా ఉతప్ప (91 మ్యాచ్‌లు) నిలిచాడు. ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఉతప్ప 5 ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ సీజన్‌లో కేకేఆర్ నుంచి రూ.3 కోట్లకు ఉతప్పను రాజస్థాన్ వేలంలో దక్కించుకుంది. 


Also Read : Shreyas Iyer: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు షాక్!


కేకేఆర్ కెప్టెన్ దినేష్ కార్తీక్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నారు. కార్తీక్ 87 మ్యాచ్‌లు, రోహిత్ జట్టు ఓటమి చెందిన 85 మ్యాచ్‌లలో భాగస్వామిగా ఉన్నారు. ఢిల్లీ క్యాపిటల్స్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా 57 మ్యాచ్ ఓటములతో టాప్ 5 స్థానంలో కొనసాగుతున్నాడు. ఓటమిపాలైన జట్టు ఆటగాడిగా చెత్త రికార్డులలో టాప్ 5 లో ముగ్గురు కెప్టెన్లు ఉండటం గమనార్హం. 



మరిన్ని కథనాలు మీకోసం




 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe