భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ తదుపరి కార్యనిర్వహణపై అడుగులు వేస్తోంది. టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఐపీఎల్ 2020 పూర్తి చేయాలని ప్లాన్ చేస్తోంది. యూకేలో నిర్వహించాలనుకున్నా అధికంగా చెల్లించాల్సి రావడంతో బీసీసీఐకి తక్కువ లాభాలు, వాతావరణ సమస్య లాంటి విషయాలతో వేదికను ఖరారు చేసుకోలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గత ఏడాది కరోనా వ్యాప్తి చెందుతున్న సమయంలోనూ యూఏఈ వేదికగా మూడు వేదికలలో ఐపీఎల్ 2020ని ఏ ఇబ్బంది లేకుండా నిర్వహించారు. కానీ ఈ ఏడాది భారత్‌లో నిర్వహించంతో కరోనా కేసులు నమోదు కావడంతో ఐపీఎల్ 2021ను నిరవధిక వాయిదా వేయడం తెలిసిందే. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఒక నెల వ్యవధిలో మిగతా మ్యాచ్‌లను నిర్వహించి ఐపీఎల్ 2021(IPL 2021)ను విజయవంతం చేయాలని బీసీసీఐ పావులు కదుపుతోంది. ఐసీసీ టీ20 ప్రపచం కప్ ప్రారంభానికి ముందు.. సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 14వ సీజన్‌ను పూర్తి చేయాలని బీసీసీఐ అధికారులు భావిస్తున్నారు. 


Also Read: Wrestler Sushil Kumar Arrested: రెజ్లర్ సుశీల్ కుమార్‌ను అరెస్ట్ చేసిన స్పెషల్ టీమ్


మరోవైపు టీమిండియా జూన్ 18 నుంచి ఇంగ్లాండ్ టూర్ ప్రారంభించనుంది. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్ పూర్తి అయిన వెంటనే విరాట్ కోహ్లీ సారథ్యంలోని జట్టు ఇంగ్లాండ్‌తో 5 టెస్టుల సిరీస్‌ను ఆగస్టు 5 నుంచి ప్రారంభిస్తుంది. టీమిండియా (Team India) ఇంగ్లాండ్ టూర్ సెప్టెంబర్ 14న ముగియనుండగా, బీసీసీఐ సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు, ప్లే ఆఫ్స్, ఫైనల్ నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తోంది. ఇది సాధ్యం కావాలంటే ఇంగ్లాండ్‌తో టెస్టులకు మధ్య విరామాన్ని మొత్తంగా ఓ వారం రోజులవరకు తగ్గించాలని ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు(ECB)ని బీసీసీఐ అధికారులు కోరనున్నారని రిపోర్టులో తెలిపారు. 


Also Read; Asia Cup 2021 Cancel: కరోనా ఎఫెక్ట్, ఆసియా కప్ రద్దు చేసిన శ్రీలంక క్రికెట్ బోర్డ్


రెండు, మూడు టెస్టుల మధ్య ఏకంగా 9 రోజుల విరామ సమయం ఉందని, దాన్ని సాధ్యమైనంత తక్కువ రోజులకు కుదించాలని ఈసీబీతో బీసీసీఐ చర్చిస్తోంది. ఆగస్టు 12 నుంచి 16 వరకు రెండో టెస్టు జరగనుండగా, ఆగస్టు 25 నుంచి 29 వరకు మూడో టెస్టు షెడ్యూల్ చేశారు. ఇలా ఇంగ్లాండ్ టూర్ త్వరగా పూర్తయితే యూఏఈలో ఐపీఎల్ మిగిలిన 31 మ్యాచ్‌లను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి సన్నాహకాలు మొదలుపెట్టారు. శనివారం, ఆదివారాల్లో డబుల్ హెడర్ మ్యాచ్‌లు అంటే మొత్తం 8 రోజులలో 16 మ్యాచ్‌లు నిర్వహించంపై ఐపీఎల్ పాలక మండలి నిర్ణయం తీసుకోనుందని టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఓ అధికారి తాజా అప్‌డేట్స్ అందించారు.


Also Read: Ashes Series Schedule: ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ షెడ్యూల్ ప్రకటించిన ఈసీబీ 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook