టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్‌గా ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడో, వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మన్‌గా సైతం రాణించాడు. అయితే క్రమశిక్షణ, సమయపాలనకు నిబద్ధుడిగానూ ధోనీకి పేరుంది. టీమిండియా ఆటగాళ్లలో బద్ధకం పోగోట్టేందుకు, క్రమశిక్షణ చర్యలు కఠినతరం చేయడాన్ని టీమిండియా మాజీ కోచ్ పాడీ ఆప్టన్ గుర్తుచేసుకున్నాడు.
తాను టీమిండియాకు ఓ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో టెస్టు జట్టుకు లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే, వన్డే జట్టుకు ఎంఎస్ ధోనీ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు. ఆటగాళ్లలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం తీసుకురావడానికి ఏం చేస్తే బాగుంటుందని Team India టెస్ట్ కెప్టెన్ అనిల్ కుంబ్లే, వన్డే జట్టుకు ఎంఎస్ ధోనీలను సలహా కోరాడు. ఏ ఆటగాడైతే ప్రాక్టీస్‌కు, నెట్ సెషన్‌కు ఆలస్యంగా వస్తాడో అతడు రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కుంబ్లే సూచించాడు.
Also Read: Bhuvneshwar Kumar: పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు షాకిచ్చిన BCCI సెలక్షన్ కమిటీ, WTC Finalకు భువీ దూరం
వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రం మరో అడుగు ముందుకేసి, ఒక్క ఆటగాడు ఏదైనా సెషన్‌కు, ప్రాక్టీస్‌కు ఆలస్యంగా వచ్చినట్లు గుర్తిస్తే మొత్తం జట్టులోని ఆటగాళ్లు ఒక్కొక్కరు రూ.10,000 జరిమానాకు గురవుతారని చెప్పాడు. నిర్ణయం సరియైనదని భావిస్తున్నావా, ఆటగాళ్లు అందుకు ఒప్పుకుంటారా అని ఎంఎస్ ధోనీని అడగగా, అలా చేస్తే ఏ ఆటగాడు ట్రైనింగ్‌కు ఆలస్యంగా రాడని బదులిచ్చాడు. జట్టు సమష్టిగా రాణించాలన్నా, క్రమశిక్షణ, అంకితభావం పెంపొందాలంటే ఇదే సరైన నిర్ణయమని ఎంఎస్ ధోనీ (MS Dhoni) బదులిచ్చినట్లు గతంలో జరిగిన ఘటన గురించి మాజీ కోచ్ ప్యాడీ ఆప్టన్ గుర్తుచేసుకున్నాడు.
Also Read: Team India ప్లేయర్స్ కేవలం Covishield Vaccine తీసుకుంటున్నారు, కారణమేంటో తెలుసా
టీ20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచకప్ విజయాలు, ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్‌గా ధోనీ నిలవడానికి అతడు తీసుకునే నిర్ణయాలే కారణమని అభిప్రాయపడ్డాడు. సంయమనం కోల్పోకుండా, ఆటగాళ్లకు సలహాలిస్తూనే తన వ్యూహాలతో ప్రత్యర్థి జట్లను బోల్తాకొట్టించడం ధోనీకి బలమని కితాబిచ్చాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 39 ఏళ్ల ఎంఎస్ ధోనీ గత ఏడాది ఐపీఎల్ 2020కు ముందు రిటైర్మెంట్ ప్రకటించడం తెలిసిందే. ప్రస్తుతం ఐపీఎల్ 2021లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ కొనసాగుతున్నాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook