BCCI decision for IPL 2022: క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) యోచిస్తోంది. అందులోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆరంభమయ్యాక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతర్జాతీయ మ్యాచ్‌లకు అందుబాటులో లేకున్నాడా ఐపీఎల్‌కు క్రికెటర్లు సై అంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ ఏడాది కరోనా వైరస్ కేసులు రావడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 నిరవధిక వాయిదా పడింది. సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 14వ సీజన్ (IPL 2021 Suspension) మిగతా మ్యాచ్‌లను నిర్వహించి పూర్తి చేయనున్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఐపీఎల్ 2022పై బీసీసీఐ తర్జనభర్జన పడుతోంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ క్రేజ్‌ను ఉపయోగించుకుని మరో రెండు జట్లకు అనుమతి ఇవ్వడంపై ఫోకస్ చేస్తోంది. బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమల్ ఐఏఎన్‌ఎస్ మీడియాతో సోమవారం మాట్లాడారు. వచ్చే ఏడాది మరో రెండు ఫ్రాంచైజీలకు అవకాశం ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తుందని తెలిపారు. భారత్‌లో మార్కెట్ పరిస్థితి అంచనా వేసిన తరువాత బీసీసీఐ తన తుది నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందన్నారు.


Also Read: T20 World Cup venue shifted to UAE: దుబాయ్‌లోనే టీ20 వరల్డ్ కప్: సౌరవ్ గంగూలీ


ఐపీఎల్ 2022 జట్లపై కచ్చితమైన నిర్ణయం ఎప్పుడూ తీసుకుంటారనేది చెప్పలేము. అందుకు పలు విషయాలు కారణాలు అన్నారు. అహ్మదాబాద్ ఫ్రాంచైజీ రేసులోకి వస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 29 మ్యాచ్‌ల తరువాత ఐపీఎల్ 2021ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) వేదికగా సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 తేదీల (IPL 2021 Final Match) మధ్య సీజన్ మిగతా 31 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. గతేడాది భారత్‌లో కరోనా ఉధృతి అధికంగా ఉందని యూఏఈలోనే ఐపీఎల్ 2020 నిర్వహించడం తెలిసిందే. దీంతో వరుసగా రెండో ఏడాది అక్కడే మిగతా మ్యాచ్‌లు నిర్వహించేందుకు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఒప్పందం చేసుకుంది.


Also Read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో Team India ఓటమికి Sachin Tendulkar కారణాలు ఇవే


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook