T20 World Cup venue shifted to UAE: దుబాయ్‌లోనే టీ20 వరల్డ్ కప్: సౌరవ్ గంగూలీ

T20 World Cup venue shifted to UAE: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ వేదికను భారత్ నుంచి యూఏఇకి షిఫ్ట్ చేసినట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly about T20 World Cup venue) అధికారికంగా ధృవీకరించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యానే టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఇకి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని సౌరబ్ గంగూలీ ప్రకటించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 28, 2021, 04:20 PM IST
T20 World Cup venue shifted to UAE: దుబాయ్‌లోనే టీ20 వరల్డ్ కప్: సౌరవ్ గంగూలీ

T20 World Cup venue shifted to UAE: న్యూ ఢిల్లీ: టీ20 వరల్డ్ కప్ వేదికను భారత్ నుంచి యూఏఇకి షిఫ్ట్ చేసినట్టు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly about T20 World Cup venue) అధికారికంగా ధృవీకరించారు. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా భారత్‌లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యానే టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఇకి షిఫ్ట్ చేయాల్సి వచ్చిందని సౌరబ్ గంగూలీ ప్రకటించారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ బీసీసీఐ తాజాగా ఐసీసీకి ఓ లేఖ రాసింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 16 జట్లు పాల్గొనే టొర్నమెంట్‌ను భారత్‌లో నిర్వహించడం అసాధ్యం అని బీసీసీఐ తమ లేఖలో పేర్కొంది. 

టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌ని భారత్‌లో నిర్వహించగలరా లేదా అనే విషయాన్ని జూన్ 28 లోగా తెలియజేయాల్సిందిగా సూచిస్తూ గతంలోనే బీసీసీఐకి ఐసిసి (ICC) గడువు విధించిన నేపథ్యంలోనే తాజాగా బీసీసీఐ (BCCI) ఈ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు దుబాయ్, అబు ధాబి, షార్జా, మస్కట్ నగరాల్లో టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగనుంది. 

Also read : Archer Deepika Kumari: హ్యాట్రిక్ స్వర్ణాల ఎఫెక్ట్, ప్రపంచ నెంబర్ 1గా భారత స్టార్ ఆర్చర్ దీపికా కుమారి

ఐపిఎల్ 14వ సీజన్ మ్యాచ్‌లు (IPL 2021 UAE Schedule updates) సైతం సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఇలోనే పూర్తి కానున్నాయి. అంటే ఐపిఎల్ 2021 ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ (T20 World Cup UAE Schedule) సంబరాలు షురూ కానున్నాయన్న మాట. జూలై 6 తర్వాత ఐపిఎల్ ఫ్రాంఛైజీలు దుబాయ్ వెళ్లి అక్కడ తమ జట్లకు సంబంధించిన ఆటగాళ్లకు ఏర్పాట్లు చేపట్టడంపై దృష్టిసారించేందుకు సిద్ధం అవుతున్నాయి.

Also read: WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్లో Team India ఓటమికి Sachin Tendulkar కారణాలు ఇవే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News