IPL 2021 Final: ఐపీఎల్‌ 2021 ఫైనల్(IPL 2021 Final) పోరులో సీఎస్‌కే, కేకేఆర్‌ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేకేఆర్ బౌలింగ్(Bowling) ఎంచుకుంది.  ఇక మ్యాచ్‌లో సీఎస్‌కే(CSK) ఫెవరెట్‌గా కనిపిస్తుండగా.. కేకేఆర్‌ కూడా పటిష్టంగానే కనిపిస్తుంది. లీగ్‌ దశలో సీఎస్‌కే 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. 5 ఓటములతో రెండో స్థానంలో నిలిచింది.  ఇక కేకేఆర్‌(KKR) 14 మ్యాచ్‌ల్లో 7 విజయాలు.. ఏడు ఓటములతో నాలుగో స్థానంలో నిలిచింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఢిల్లీ క్యాపిటల్స్‌(Delhi Capitals)తో జరిగిన క్వాలిఫయర్‌ 1లో సీఎస్‌కే ఘన విజయం సాధించి నేరుగా ఫైనల్లో అడుగుపెట్టింది. ఇక ఆర్‌సీబీ(RCB)ని ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో ఓడించిన కేకేఆర్‌ క్వాలిఫయర్‌ 2లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్లో అడుగుపెట్టింది. లీగ్‌ దశలో రెండుసార్లు తలపడగా.. సీఎస్‌కేనే విజయం వరించింది. ముఖాముఖి పోరులో 24 సార్లు తలపడగా.. 16 మ్యాచ్‌ల్లో సీఎస్‌కే(Csk) విజయం సాధించగా.. కేకేఆర్‌ 8సార్లు గెలిచింది.


Also read:IPL 2021 Final: ఫ్యాన్స్ కు షాకిచ్చిన డేవిడ్ వార్నర్..చెన్నై జెర్సీతో నెట్టింట హల్ చల్!


చెన్నై సూపర్ కింగ్స్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్, ఫాఫ్ డు ప్లెసిస్, రాబిన్ ఉతప్ప, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్‌ ధోని (వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రావో, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హాజెల్‌వుడ్


కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు: శుబ్‌మన్‌ గిల్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా, రాహుల్ త్రిపాఠి, దినేష్ కార్తీక్ (వికెట్‌ కీపర్‌), ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్‌), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లోకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి