ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలిసారిగా సీజన్ మధ్యలోనే నిలిచిపోయింది. ఆటగాళ్లు, కోచ్, వ్యక్తిగత సిబ్బంది కరోనా వైరస్ బారిన పడటంతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఐపీఎల్ సీజన్ 14ను నిరవధికంగా వేయడం తెలిసిందే. అయితే అంతకుముందే ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సీజన్ మధ్యలోనే వైదొలిగాడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ మధ్యలోనే వైదొలగడంపై టీమిండియా క్రికెటర్ అశ్విన్ స్పందించాడు. ఓ యూట్యూబ్ ఛానల్‌తో మాట్లాడుతూ.. ‘నేను ఐపీఎల్ 2021  (IPL 2021) మధ్యలోనే వైదొలగే సమయానికి నా కుటుంబంలో చాలా మంది కరోనా బారిన పడ్డారు. అందులో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఆసుపత్రిలో చేరి వారు చికిత్స పొందుతున్నారు. నాకు విషయాలు తెలియడంతో దాదాపు 8 నుంచి 9 రోజులు సరిగా నిద్రపోలేదు. అలాంటి పరిస్థితిలోనే ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. దాంతో నాపై ఒత్తిడి పెరిగింది. ఈ బాధ భరించలేక సీజన్ మధ్యలోనే వైదొలగాలని నిర్ణయం తీసుకున్నానని’ అశ్విన్ వివరించాడు.


Also Read: Sagar Rana murder case: సాగర్ రాణాపై Sushil Kumar కర్రతో దాడికి పాల్పడుతున్న ఫోటో వైరల్


సీజన్‌లో మళ్లీ ఆడగలనా లేదా అని సైతం ఆలోచించానని తెలిపాడు. అయితే కుటుంబానికి నా సహాయం అవసరమైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నానని అశ్విన్ భావిస్తున్నాడు. తన కుటుంబసభ్యులు ఒక్కొక్కరుగా కోవిడ్19 బారి నుంచి కోలుకున్నారని హర్షం వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 ఆడేందుకు తాను ఇప్పుడు సిద్ధంగా ఉన్నానని Ravichandran Ashwin వెల్లడించాడు. కరోనా కారణంగా సీజన్ ప్రస్తుతం వాయిదా పడిందని, తిరిగి ప్రారంభమైతే ఆడేందుకు తానెప్పుడో సన్నద్ధమయ్యాయని చెప్పుకొచ్చాడు. 


Also Read: IPL 2021: ఐపీఎల్ సెకండాఫ్‌లో MS Dhoni అత్యుత్తమ ప్రదర్శన చూడబోతున్నాం


న్యూజిలాండ్‌తో తలపడనున్న టీమిండియా జట్టులో సభ్యుడైన ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ ప్రస్తుతం యూకేలో 14 రోజుల క్వారంటైన్‌లో ఉన్నాడు. జూన్ 18న సౌతాంప్టన్ వేదికన ఐసీసీ నిర్వహిస్తున్న తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ప్రారంభం కానుంది. అనంతరం ఇంగ్లాండ్‌తో విరాట్ కోహ్లీ సేన టెస్ట్ సిరీస్ ఆడనుంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook