IPL 2021: కరోనా వైరస్ కారణంగా తొలిసారిగా ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మధ్యలోనే ఆగిపోయింది. ఆటగాళ్లు, కోచ్‌లు, వ్యక్తిగత సిబ్బంది, మైదాన సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఐపీఎల్ 2021ను భారత క్రికెట్ నియంత్రణ మండలి నిరవధికంగా వేయడం తెలిసిందే. అయితే ఐపీఎల్ మిగతా మ్యాచ్‌లు నిర్వహిస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెప్టెంబర్ నెలలో ఐపీఎల్ 2021 మిగతా మ్యాచ్‌లు నిర్వహించనున్నారని సైతం వాదన వినిపిస్తోంది. యూఏఈ వేదికగా ఐపీఎల్ సీజన్ 14 మిగతా సగం మ్యాచ్‌లు నిర్వహిస్తారని, బీసీసీఐ దీనిపై యోచిస్తుందని కథనాలు వస్తున్నాయి. అయితే ఐపీఎల్ 2021 తదుపరి మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండరు. వారు తమ అంతర్జాతీయ మ్యాచ్‌ల షెడ్యూల్ కారణంగా ఐపీఎల్‌ తదుపరి మ్యాచ్‌లకు అందుబాటులో ఉండరని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు డైరెక్టర్ ఆష్లై గైల్స్ బ్రిటీష్ మీడియాకు తెలిపాడు. 


Also Read: T20 World Cup 2021 ఆడేందుకు యార్కర్ స్పెషలిస్ట్ Lasith Malinga వచ్చేస్తున్నాడు


సుదీర్ఘ షెడ్యూళ్లు, టీ20 వరల్డ్ కప్ కారణంగా ఐపీఎల్ తాజా సీజన్‌ తిరిగి ప్రారంభమైనా ఇంగ్లాండ్ అందుబాటులో ఉండటం కష్టమేనని తేలిపోయింది. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లతో ఇంగ్లాండ్ సిరీస్‌లు ఆడనుందని ఆష్లై గైల్స్ వెల్లడించాడు. మరోవైపు టీమిండియా ఐపీఎల్ పైనే ఫోకస్ చేస్తుందన్నాడు. జూన్ నెలలో ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌తో 2 నుంచి 14 తేదీల మధ్య 2 టెస్టు మ్యాచ్‌లు ఆడేందుకు షెడ్యూల్ చేశారు. న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ కాంట్రాక్టు ప్రకారం ఐపీఎల్ 2021 తదుపరి మ్యాచ్‌లు ఆడేందుకు అవకాశం ఇచ్చింది కివీస్ బోర్డ్.


Also Read: 7th Pay Commission: ఉద్యోగులకు భారీగా పెరగనున్న వేతనాలు, త్వరలోనే 3 DA, ఇతరత్రా అలవెన్సులు


న్యూజిలాండ్ బోర్డుతో తమ విషయాన్ని ముడిపెట్టి చూడచూడదని ఇంగ్లాండ్ బోర్డ్ డైరెక్టర్ ఆష్లై గైల్స్ చెబుతున్నాడు. వారు ఐపీఎల్ ఆడే సమయంలో జాతీయ జట్టుకు ఆడటం సాధ్యం కాదని ముందుగా నిరభ్యంతర పత్రాన్ని తీసుకున్నారని గుర్తుచేశాడు. ఐపీఎల్ 2021 తదుపరి మ్యాచ్‌ల నిర్వహణ వీలవుతుందని ఎవరూ భావించడం లేదన్నాడు. కేవలం తదుపరి సిరీస్‌లు, టీ20 వరల్డ్ కప్‌ల మీద ఇంగ్లాండ్ జట్టు ఫోకస్ చేస్తుందని చెప్పుకొచ్చాడు.


Also Read: COVID-19 విషాదం, కరోనాతో టీమిండియా క్రికెటర్ Piyush Chawla తండ్రి కన్నుమూత 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook