Virat Kohli becomes brand ambassador of VIVO: ఐపిఎల్ 2021 టైటిల్ స్పాన్సర్ వివో మరో తెలివైన నిర్ణయం తీసుకుంది. ఐపిఎల్ 2021 ప్రారంభం కావడానికి సరిగ్గా రెండు రోజుల ముందే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీని తమ వివో బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఐపిఎల్‌లో విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఆ క్రేజీని క్యాష్ చేసుకునేందుకు వివో ఈ నిర్ణయం తీసుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విరాట్ కోహ్లీతో జరిగిన అగ్రిమెంట్ ప్రకారం ఇకపై వివో కంపెనీ నుంచి రానున్న స్మార్ట్ ఫోన్స్, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నింటిని కోహ్లీ ప్రమోట్ చేయనున్నాడని తెలుస్తోంది. టీవీ, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీ ద్వారా మరింత మంది జనంలోకి వెళ్లాలని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అంటే ఎంతో ఆసక్తి చూపించే యువతకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతోనే వివో ఈ అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. 


Also read : Sunrisers Hyderabad Full Squad: సన్‌రైజర్స్ హైదరాబాద్ మొత్తం ఆటగాళ్లు, వారి ప్రదర్శన వివరాలు


కస్టమర్స్ జీవితాల్లో మరింత ఆనందాన్ని నింపాలనే లక్ష్యంతో వివో బ్రాండ్ ముందుకెళ్తున్నట్టు వివో ఇండియా బ్రాండ్ స్ట్రాటెజీ విభాగం డైరెక్టర్ నిపుణ్ మౌర్య తెలిపారు. అమీర్ ఖాన్, సారా అలీ ఖాన్ (Aamir Khan, Sara Ali Khan) వంటి సినిమా స్టార్స్‌తో పాటు స్పోర్ట్స్ సెలబ్రిటీలతోనూ తమ బ్రాండ్ ప్రమోట్ చేయించడం ద్వారా మరింత ఎక్కువ మందికి చేరుకోవచ్చనే అంచనాతోనే విరాట్ కోహ్లీని (Virat Kohli) బ్రాండ్ అంబాసిడర్‌గా తీసుకున్నట్టు నిపుణ్ పేర్కొన్నారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook