ఇంగ్లాండ్ జట్టును విరాట్ కోహ్లీ సేన పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. తొలుత టెస్టు సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. ఆపై టీ20 సిరీస్‌ను సైతం చేసుకున్న టీమిండియా తాజాగా వన్డే సిరీస్‌ను సైతం గెలుచుకుని అన్ని సిరీస్‌లను క్లీన్ స్వీప్ చేసినట్లయింది. అయితే ఆదివారం జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ కోహ్లీ అందుకున్న ఓ క్యాచ్ వైరల్ అవుతోంది.
ఆదిల్ రషీద్‌తో కలిసి టాలెంటెడ్ క్రికెటర్ సామ్ కరన్ 57 పరుగులు జోడించాడు. దాంతో ఇంగ్లాండ్ జట్టు మళ్లీ రేసులోకి వచ్చింది. టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ వేసిన ఇన్నింగ్స్ 40వ ఓవర్‌లో ఈ భాగస్వామ్యానికి తెరపడింది. రషీద్ ఆడిన బంతిని షార్ట్ కవర్‌లో ఉన్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) గాల్లోకి పక్షిలా ఎగిరి ఒంటి చేత్తో అందుకున్నాడు. అది సైతం ఎడమ చేతితో కోహ్లీ ఈ సన్నింగ్ క్యాచ్ తీసుకోవడం మ్యాచ్‌లో టర్నింగ్ పాయింట్ అయింది.
Also Read: IPL 2021: గాయం నుంచి కోలుకుని ఐపీఎల్‌కు సిద్ధమైన స్టార్ పేసర్ మహమ్మద్ షమీ
Virat Kohli. That's it. That's the tweet.🤯
One handed blinder!💥#INDvENG pic.twitter.com/pciZLwIoY6
— n. (@comeonvirat) March 28, 2021
శార్దూల్ ఠాకూర్‌కు కీలకమైన నాలుగో వికెట్ సైతం దక్కింది. రషీద్ 22 బంతుల్లో 19 పరుగుల ఇన్నింగ్స్‌కు తెరపడగా, ఆపై సామ్ కరన్ తన ఇన్నింగ్స్‌ను విజయం దిశగా తీసుకెళ్లాడు. 8వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సామ్ కరన్ 95 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. కానీ చివరికి 7 పరుగుల తేడాతో టీమిండియా(Team India) విజయం సాధించింది. చివరి ఓవర్‌లో విజయానికి 14 పరుగులు అవసరం కాగా, నటరాజన్ తెలివిగా బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి భారత్‌కు విజయాన్ని అందించాడు.
What a catch by the Captain and @imShard picks up his fourth wicket.
Take a bow @imVkohli 🔥
Live - https://t.co/wIhEfE5PDR #INDvENG @Paytm pic.twitter.com/VpsV5xF3yv
— BCCI (@BCCI) March 28, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook