IPL 2021: క్రికెట్ ప్రేమికులకు బీసీసీఐ(BCCi) గుడ్ న్యూస్ చెప్పింది.  సెప్టెంబర్ 19వ తేదీ నుంచి యూఏఈ(UAE) వేదికగా ప్రారంభం కానున్న సెకండాఫ్ ఐపీఎల్ మ్యాచ్‌(IPL Matches)లను చూసేందుకు ప్రేక్షకులకు అనుమతిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 16 నుంచి టికెట్లు(Tickets) అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. అధికారిక వెబ్‌సైట్ www.iplt20.com తో పాటుగా PlatinumList.net ‌వెబ్‌సైట్ల ద్వారా టికెట్లు కొనుగోలు చేయవచ్చునని పేర్కొంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఐపీఎల్ సీజన్ 14లో ఇండియా వేదికగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే మధ్యలో కరోనా ఎఫెక్ట్‌(Corona Effect)తో బీసీసీఐ టోర్నిని మధ్యలో వాయిదా వేసింది. తర్వాత సెకండాఫ్‌ను యూఏఈలో నిర్వహించనున్నట్టుగా ప్రకటించింది. ఇక, ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 2021(IPL 2021) తొలి దశ మ్యాచ్‌లలో ఆడిన 8 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో.. తక్కువ సంఖ్యలో ఆడియన్స్ స్టాండ్స్‌లో హాజరైతే.. మ్యాచ్‌లు మరింత కిక్కునిస్తాయని చెప్పొచ్చు.


Also read: T20 World Cup: టీ20 ప్రపంచకప్ ఇండియా జట్టు ఎంపికపై గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు


ఐపీఎల్‌లో  సెకాండఫ్ మ్యాచ్‌ల‌ను సెప్టెంబ‌ర్ 19 నుంచి యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్(Mumbai Indians), చెన్నై సూపర్‌ కింగ్స్(Chennai Super Kings) మధ్య జరుగనుంది.  అక్టోబర్ 15వ తేదీన ఈ టోర్నీ ఫైనల్(Final) మ్యాచ్ జరగుతుంది. ఇప్పటికే అన్ని టీమ్స్ ప్లేయర్స్ యూఏఈ చేరుకొని ప్రాక్టీస్ షూరూ చేశారు. అయితే కోవిడ్ నిబంధనలు, యూఏఈ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా పరిమిత సిట్టింగ్‌తో అభిమానులను స్టేడియాల్లోకి అనుమతించే అవకాశం ఉంది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook