T20 World Cup: టీ 20 ప్రపంచకప్ వచ్చే నెల ప్రారంభం కానుంది. ఈ క్రమంలో టీమ్ ఇండియా జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా తన ప్రాధాన్యతలో ఓ జట్టును ప్రకటించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.
అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్(T20 World Cup) పోరు ప్రారంభం కానుంది. యూఏఈ - ఒమన్ వేదికగా ప్రారంభం కానున్న ఈ పోరు కోసం బీసీసీఐ టీమ్ ఇండియాను ఇప్పటికే ప్రకటించింది. ఈ పోరులో భాగంగా టీమ్ ఇండియా అక్టోబర్ 24వ తేదీన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా పాకిస్తాన్‌లు పాల్గొననున్నాయి. ఇప్పుడు అందరి దృష్టీ ఈ పోరుపైనే పడింది. ప్రత్యర్ధి దేశాల మధ్య పోటీ అంటే ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటుంది. ఇండియా-పాకిస్తాన్‌ల మధ్య క్రికెట్ అంటే అందరూ టీవీలకు అతుక్కుపోయి కూర్చుంటారు. ఈ రెండు జట్ల మధ్య పోటీ అలా ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకూ జరిగిన పోరులో ఇండియాదే పైచేయిగా ఉంది. ప్రపంచకప్ పోటీల్లో ఇప్పటి వరకూ రెండు దేశాలు 11 సార్లు తలపడగా..పైచేయి ఇండియాదే ఉంది. రెండు దేశాల మధ్య పోటీ ఎప్పుడూ చాలా ఆసక్తిగానే మారుతోంది. టీ20 ప్రపంచకప్ కోసం బీసీసీఐ (BCCI)ప్రకటించిన జట్టు ఇలా ఉంది.
బీసీసీఐ ప్రకటించిన టీమ్ ఇండియా జట్టు(Team India)
విరాట్ కోహ్లి ( కెప్టెన్ ), రోహిత్ శర్మ ( వైస్ కెప్టెన్ ), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్ ), ఇషాన్ కిషన్ ( వికెట్ కీపర్ ), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ.ఇక శ్రేయస్ అయ్యర్, శార్ధూల్ ఠాకూర్, దీపక్ చహార్‌లు స్టాండ్ బై ప్లేయర్స్‌గా ఉంటారు.
అయితే టీమ్ ఇండియా జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్(Gautam Gambhir)ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ప్రాధాన్యతలో జట్టు ఎలా ఉంటుందో ప్రకటించారు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ఓపెనర్లుగా ఉండాలని..విరాట్ కోహ్లి వన్‌డౌన్‌లో సూర్యకుమార్ నాలుగవ స్థానంలోనూ బ్యాటింగ్‌కు దిగాలని తెలిపారు. ఆ తరువాత రిషభ్ పంత్, హార్ధిక్ పాండ్యా, జడేజా, భువీ, వరుణ్ చక్రవర్తి, షమీలు ఉండాలన్నారు. పదకొండో స్థానంలో బుమ్రా ఉండాలన్నారు. రవిచంద్రన్ అశ్విన్‌కు మాత్రం గౌతం గంభీర్ చోటివ్వలేదు.
Also read: ICC T20 World Cup 2021: ప్రపంచ కప్ కోసం జట్లను ప్రకటించిన వెస్టిండీస్, శ్రీలంక, నమీబియా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook