IPL 2021 Auction: ఐపీఎల్ 2021 ఆటగాళ్ల వేలం తేదీ, వేదిక ఖరారు
IPL 2021 Player Auction Latest Update:
IPL 2021 Player Auction On 18th February: గత ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2020) కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా 6 నెలలు ఆలస్యంగా మొదలైంది. కానీ ఈ ఏడాది అలా కాకూడదని బీసీసీఐ, ఐపీఎల్ పాలక మండలి వేగంగా పావులు కదుపుతోంది. ఈ మేరకు ఈ నెల 19న తాము రిలీజ్ చేసిన ఆటగాళ్లతో పాటు రీటెయిన్ చేసుకున్న వారి జాబితాను అన్ని ఫ్రాంచైజీలు ప్రకటించాయి.
ఐపీఎల్ 14వ ఎడిషన్ ఐపీఎల్ 2021(IPL 2021 Auction Latest Update)కు సంబంధించిన మినీ వేలం ఫిబ్రవరి 18న జరగనుంది. చెన్నై వేదికగా ఐపీఎల్ 14 సీజన్‌కు కావాల్సిన వేలం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ తమ అధికారిక ట్విట్టర్ పేజీలో ప్రకటించింది. మీరు ఈ వేలం గురించి ఎంత ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంటూ ట్వీట్ చేసింది.
Also Read: Ravichandran Ashwin: చటేశ్వర్ పుజారా అలా చేస్తే సగం మీసం తీసేసి మ్యాచ్ ఆడతానంటూ అశ్విన్ ఛాలెంజ్
కాగా, జనవరి 20తో చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) మొదలుకుని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరకు అన్ని ఫ్రాంచైలకు చెందిన పలువురు ఆటగాళ్ల కాంట్రాక్టులు ముగిశాయి. దీంతో అన్ని ఫ్రాంచైజీలు తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. గత సీజన్‌లో తీవ్రంగా నిరాశ పరిచిన కీలక ఆటగాళ్లను సైతం ఫ్రాంచైజీలు రిలీజ్ చేశాయి. మొత్తం 139 మంది ఆటగాళ్లను ఆయా జట్లు అట్టిపెట్టుకోగా, 57 మందిని రిలీజ్ చేశారు. ఈ ఆటగాళ్లతో పాటు కొందరు కొత్త ఆటగాళ్లు ఐపీఎల్ 2021 వేలంలోకి రానున్నారు.
Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే
గత ఆరేళ్లుగా ఉన్న స్టీవ్ స్మిత్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించడంతో పాటు ఏకంగా రిలీజ్ చేసింది రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం. తద్వారా టీమిండియా టాలెంటెడ్ ఆటగాడు సంజూ శాంసన్‌కు కొత్త సారథిగా పగ్గాలు సైతం అప్పగించింది. సీఎస్కే మేనేజ్‌మెంట్ కేదార్ జాదవ్, పీయూష్ చావ్లా, షేన్ వాట్సన్, హర్భజన్ సింగ్ లాంటి వెటరన్ ఆటగాళ్లను రిలీజ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అత్యధికంగా ఆర్సీబీ 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేసింది.
Also Read: IPL 2021: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, నాయకత్వ లక్షణాలపై Gautam Gambhir ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook