IPL 2021: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, నాయకత్వ లక్షణాలపై Gautam Gambhir ప్రశంసలు

Gautam Gambhir About MS Dhonis Speciality: ఎంఎస్ ధోనీ పేరు చెబితేనే విరుచుకుపడే టీమిండియా మాజీ ఓపెనర్ తాజాగా భిన్నంగా స్పందించాడు. ఎంఎస్ ధోనికి ఇతర కెప్టెన్లకు ఓ వ్యత్యాసం ఉందన్నాడు. కేవలం ప్రస్తుత సీజన్, అప్పటి సమయంలో ఏం కావాలో మాత్రమే ధోనీ ఆలోచిస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు.

Written by - Shankar Dukanam | Last Updated : Jan 25, 2021, 04:32 PM IST
  • టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు
  • చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తెలివిగా వ్యవహరించిందని కితాబిచ్చాడు గంభీర్
  • ఎంఎస్ ధోనీ తెలివి, వ్యూహాలకు ఇతర కెప్టెన్లు భిన్నమని అభిప్రాయపడ్డాడు
IPL 2021: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీ, నాయకత్వ లక్షణాలపై Gautam Gambhir ప్రశంసలు

Gautam Gambhir About MS Dhonis Speciality: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) కోసం ఇతర ప్రాంఛైజీలు చాలా మంది ఆటగాళ్లను రిలీజ్ చేసినా, చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం తెలివిగా వ్యవహరించిందని కితాబిచ్చాడు గంభీర్. కేవలం కొందరు ఆటగాళ్లను వదులుకున్నా, కీలక ఆటగాళ్లపై నమ్మకం ఉంచిందని అభిప్రాయపడ్డాడు.

చెన్నై సూపర్ కింగ్స్ వచ్చే ఐపీఎల్ 2021 సీజన్‌‌కుగానూ హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా, మురళీ విజయ్, కేదార్ జాదవ్, షేన్ వాట్సన్ లాంటి ఆటగాళ్లను విడుదల చేసింది. గత సీజన్‌లో ఐపీఎల్ ఆడని సురేష్ రైనా(Suresh Raina)ను తెలివిగా అట్టి పెట్టుకుందని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. కీలక ఆటగాళ్లను రిటెయిన్ చేసుకోవడం ఎంస్ఎస్ ధోనీకి బాగా తెలుసునని, అది అతడి టాలెంట్ అంటూ స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ ఛాట్ షోలో తన అభిప్రాయాలు షేర్ చేసుకున్నాడు.

Also Read: KL Rahul and Athiya shetty: క్రికెటర్ రాహుల్, అతియా శెట్టిల మధ్య ఎఫైర్‌కు సాక్ష్యమిదే

ఎంఎస్ ధోనికి ఇతర కెప్టెన్లకు ఓ వ్యత్యాసం ఉందన్నాడు. కేవలం ప్రస్తుత సీజన్, అప్పటి సమయంలో ఏం కావాలో మాత్రమే ధోనీ ఆలోచిస్తాడని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. మిగతా జట్ల కెప్టెన్లు మాత్రం చాలా వరకు ఆటగాళ్లను రిలీజ్ చేశారని, సీఎస్కే మాత్రమే ధోనీ యోచన కారణంగా స్వల్ప మార్పులు మాత్రమే చేసిందన్నాడు. ప్రతి సీజన్‌లో చెన్నై ఫ్రాంచైజీపై చాలా అంచనాలు ఉంటాయని గత సీజన్‌లో ఆ మేరకు రాణించలేదని గౌతమ్ గంభీర్(Gautam Gambhir) చెప్పాడు.

Also Read: EPF Balance Check: ఈపీఎఫ్ఓ ఖాతాల్లోకి EPF Interest జమ, మీ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోండి

ఇతర జట్ల కెప్టెన్లు సుదీర్ఘంగా ఆలోచించి భవిష్యత్ ప్రణాళికల వైపు మొగ్గుచూపుతారన్న గంభీర్.. ఎంఎస్ ధోనీ(MS Dhoni) మాత్రం ప్రస్తుత సీజన్ కోసం జట్టును ఎలా సిద్ధం చేసుకోవాలని మాత్రమే యోచిస్తాడని చెన్నై కెప్టెన్ గేమ్ ప్లాన్‌ను గంభీర్ వెల్లడించాడు. ప్లే ఆఫ్స్‌కు చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 10 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయగా, ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించని సీఎస్కే కేవలం ఐదుగురు ఆటగాళ్లను మాత్రమే రిలీజ్ చేయడం అందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.

Also Read: IPL 2021: అత్యధికంగా ఆర్జించిన భారత క్రికెటర్లు వీరే..

పీయూష్ చావ్లా, కేదార్ జాదవ్‌లను వారికున్న ఆటగాళ్ల ధర విలువ కారణంగానే ఈ సీజన్ నుంచి సీఎస్కే వారిని రిలీజ్ చేసిందని పేర్కొన్నాడు. లేదంటే వారికి మరో సీజన్ సైతం ధోనీ అవకాశం ఇచ్చేవాడని చెప్పాడు. పీయూష్ చావ్లాకు బదులుగా కరణ్ శర్మకు బంతిని ఇస్తాడని, ఇందులో పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని తన అభిప్రాయాలను షేర్ చేసుకున్నాడు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News