IPL 2021: RR vs SRH Live Score Updates: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత చెత్త ప్రదర్శన చేస్తున్న జట్ల మధ్య పోరు నేటి మధ్యాహ్నం ప్రారంభం కానుంది. అందులో ఓ జట్టు సన్‌రైజర్స్ కాగా, మరో జట్టు రాజస్తాన్ రాయల్స్. అనుభవం లేని కెప్టెన్ కావడంతో సంజూ శాంసన్ జట్టుకు విజయాలు అందించలేకపోతున్నాడు. ఓపెనర్లు రాణిస్తే మిడిలార్డర్ విఫలం కావడం, మిడిలార్డర్ రాణించిన మ్యాచ్‌లో బౌలర్లు వైఫల్యం, ఫీల్డింగ్ ప్రదర్శన మెరుగ్గా లేకపోవడంతో రాజస్తాన్ జట్టు సైతం మెరుగైన ఫలితాలు రాబట్టలేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. 6 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ కేవలం ఒక మ్యాచ్‌లో నెగ్గి 2 పాయింట్లతో పట్టికలో చివరి స్థానంలో ఉంది. రాజస్తాన్ రాయల్స్ 2 విజయాలతో 7వ స్థానంలో ఉంది. వరుస ఓటముల నేపథ్యంలో సన్‌రైజర్స్ యాజమాన్యం కెప్టెన్సీలో మార్పు చేసింది. డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది. నేటి మధ్యాహ్నం 3;30 గంటలకు రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో మ్యాచ్ ప్రారంభం కానుంది. (IPL 2021 RR vs SRH Live Score)


Also Read: Ambati Rayudu’s Six: భారీ సిక్సర్‌తో fridge glass door పగలగొట్టిన అంబటి రాయడు



లీగ్‌లో ముందుకు సాగాలంటే వరుసగా మ్యాచ్‌లు నెగ్గాల్సిన సమయంలో కేన్ విలియమ్సన్‌కు సన్‌రైజర్స్ బాధ్యతలు అప్పగించారు. మరోవైపు ఓపెనర్లు రాణిస్తే మిడిలార్డర్ వైఫల్యం చెందడం, మిడిలార్డర్ రాణించిన మ్యాచ్‌లో ఓపెనర్లు నెమ్మదిగా బ్యాటింగ్ చేయడం లాంటి కారణాలతో ఓటములు వెంటాడుతున్నాయి. రెండో విజయం కోసం ఎస్ఆర్‌హెచ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నేటి మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్ రౌండర్ జేసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టాపార్డర్‌లో బ్యాట్ ఝులిపించకపోయినా, మిడిలార్డర్ స్థిరంగా రాణించకపోయినా సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) ఖాతాలో మరో ఓటమి జమ అవుతుంది.


Also Read: IPL 2021: Pat Cummins ఐపీఎల్ మధ్యలోనే విడిచి వెళ్తాడా, క్లారిటీ ఇచ్చిన ఆల్ రౌండర్


భారత కాలమానం ప్రకారం నేటి మధ్యాహ్నం 3 గంటలకు టాస్ వేయనున్నారు. 
వేదిక: ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియం
లైవ్: స్టార్ స్పోర్ట్స్ ఛానల్, డిస్నీ + హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం


రాజస్తాన్ రాయల్స్ ప్రాబబుల్స్:
జాస్ బట్లర్, యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్ (కీపర్, కెప్టెన్), శివం దుబే, రియాన్ పరాగ్, డేవిడ్ మిల్లర్, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కత్, ముస్తాఫిజర్ రెహ్మాన్, చేతన్ సకారియా


సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్స్:
డేవిడ్ వార్నర్/ సాహా, జానీ బెయిర్‌స్టో(కీపర్), మనీశ్ పాండే, కేన్ విలియమ్సన్(కెప్టెన్), విజయ్ శంకర్, కేదార్ జాదవ్, రషీద్ ఖాన్, జగదీష్ సుచిత్/ జేసన్ హోల్డర్, సిద్ధార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook