Ravichandran Ashwin: ఐపీఎల్ 2021 నుంచి విరామం తీసుకున్న రవిచంద్రన్ అశ్విన్, రీ ఎంట్రీ డౌట్
Ravichandran Ashwin Takes Break From IPL 2021 | ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నుంచి మధ్యలోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన అనంతరం అశ్విన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు.
టీమిండియా క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021) నుంచి మధ్యలోనే తప్పుకుంటున్నట్లు ప్రకటించి తన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సూపర్ ఓవర్‌లో విజయం సాధించిన అనంతరం అశ్విన్ కీలక నిర్ణయాన్ని వెల్లడించాడు.
ప్రపంచ దేశాలలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం అధికంగా ఉంది, కానీ ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో కోవిడ్19 మహమ్మారి తీవ్రత ఉధృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొందరు విదేశీ క్రికెటర్లు తమ కుటుంబానికి తొలి ప్రాధాన్యత అంటూ ఐపీఎల్ 2021 ఆడేందుకు సైతం నిరాకరించారు. అందివచ్చిన అవకాశాలను వదులుకున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ తన కుటుంబం బాధ్యతలు చూసుకునేందుకు సీజన్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండలేదని ప్రకటించాడు.
Also Read: Ravindra Jadeja 36 Runs In 1 over: రవీంద్ర జడేజా విధ్వంసం, ఒక్క ఓవర్‌లో 37 పరుగులు
రేపటి నుంచి జరగనున్న ఐపీఎల్ 2021 మ్యాచ్‌ల నుంచి విరామం తీసుకుంటున్నాను. నా కుటుంబం, బంధువులు కోవిడ్19 సమస్యలతో బాధపడుతున్నారు. వారికి నా మద్దతు, సహకారం అవసరం. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలవాలని భావిస్తున్నాను. అంతా సవ్యంగా జరిగితే సీజన్‌లో మళ్లీ తిరిగొచ్చేందుకు సిద్ధమైనని ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు అశ్విన్ తన అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. అశ్విన్ నిర్ణయానికి అభిమానులు ఆశ్చర్యపోయినా, కుటుంబం కోసం కొన్నిసార్లు ఇలా చేయక తప్పదంటూ మద్దతు తెలిపారు.
Also Read: Jwala Gutta Wedding Photos: ఘనంగా గుత్తా జ్వాల, హీరో విష్ణు విశాల్ వివాహం
కాగా, ఆదివారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది. సూపర్ ఓవర్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ జట్టు 7 పరుగులు చేయగా ఢిల్లీ క్యాపిటల్స్ చివరి బంతికి లక్ష్యాన్ని చేరుకుని సూపర్ విజయాన్ని అందుకుంది. మరోవైపు 5 మ్యాచ్‌లాడిన సన్‌రైజర్స్ కేవలం ఒకే ఒక విజయంతో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook