Ravindra Jadeja 36 Runs In 1 over: రవీంద్ర జడేజా విధ్వంసం, ఒక్క ఓవర్‌లో 37 పరుగులు

Ravindra Jadeja 36 Runs in 1 over | ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్, 2 సాయంతో చెన్నై ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 25, 2021, 06:53 PM IST
Ravindra Jadeja 36 Runs In 1 over: రవీంద్ర జడేజా విధ్వంసం, ఒక్క ఓవర్‌లో 37 పరుగులు

IPL 2021 Latest Updates | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. పర్పుల్ క్యాప్ బౌలర్ బౌలింగ్‌లో ఓ ఓవర్‌లో ఏకంగా 36 పరుగులు సాధించాడు. ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్, 2 సాయంతో చెన్నై ఇన్నింగ్స్ చివరి ఓవర్‌లో సునామీ ఇన్నింగ్స్ ఆడుతూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్‌ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు.

సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా జట్టుకు తానేంత విలువైన ఆటగాడో మరోసారి నిరూపించాడు. 25 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన జడేజా మొత్తంగా 28 బంతుల్లో 62 పరుగులతో అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్‌లో జడేజా సిక్సర్ల వర్షం కురిపించడంతో చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఐపీఎల్ 2021లో తొలి మ్యాచ్‌లో 5 వికెట్ల ఇన్నింగ్స్‌తో చెలరేగిన హర్షల్ పటేల్, ప్రతి మ్యాచ్‌లోనూ రాణించడంతో ఆర్సీబీ(Royal Challengers Bangalore) వరుస విజయాలతో జోరు కొనసాగిస్తోంది.

Also Read: IPL 2021: RCB వరుస విజయాలకు MS Dhoni సీఎస్కే చెక్ పెడుతుందా, ఫ్యాన్స్‌లో ఉత్కంఠ

ఆదివారం ముంబై లోని వాంఖేడే స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో IPL 2021 పర్పుల్ క్యాప్ బౌలర్‌ను అనామక బౌలర్‌గా మార్చేశాడు సీఎస్కే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా. ఇన్నింగ్స్ చివరి ఓవర్ తొలి బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్‌గా మలిచాడు. రెండో బంతిని కవర్స్ మీదుగా సిక్స్ బాదడంతో ఆ తరువాత బంతిని చాలా ఎత్తులో వేయడంతో అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు. ఆ బంతి సైతం స్టాండ్స్‌లోకి దూసుకెళ్లింది. ఆ మరుసటి బంతిని సైతం సిక్సర్‌గా మలచడంతో జడేజా 25 బంతుల్లో అర్ధ శతకం సాధించాడు. ఆపై ఓ బంతికి 2 పరుగులు, 5వ బంతిని డీప్ మిడ్ వికెట్ మీదుగా సిక్సర్ బాదిన జడేజా చివరి బంతిని బౌండరీకి తరలించడంతో ఆర్సీబీకి 192 పరుగుల భారీ లక్ష్యాన్ని సీఎస్కే నిర్ధేశించింది.  

Also Read: Veda Krishnamurthy: కరోనాతో Team India క్రికెటర్ వేద కృష్ణమూర్తి తల్లి కన్నుమూత 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News