ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై కరోనా మహమ్మారి ప్రభావం చూపుతోంది. బయో బబుల్ వాతావరణంలో జరుగుతున్నప్పటికీ లీగ్‌లో కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. సురక్షిత వాతావరణంలో ఉన్నప్పటికీ ఇద్దరు ఆటగాళ్లకు తాజాగా నిర్వహించిన టెస్టులలో కరోనా పాజిటివ్ అని నిర్ధారించారు. ఆటగాళ్ల ఆరోగ్యం కోసం శిబిరానికి వచ్చిన క్రికెటర్లను వారం రోజులపాటు క్వారంటైన్ సైతం చేయడం తెలిసిందే. అనూహ్యంగా కరోనా కేసులు రావడం హాట్ టాపిక్ అవుతోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోల్‌కతా నైట్ రైడర్స్(KKR) ఆటగాళ్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్‌కు తాజాగా నిర్వహించిన కోవిడ్19 పరీక్షలలో పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫో ఈ విషయాన్ని రిపోర్ట్ చేసింది. బయోబబుల్‌లో ఉన్నవారికి కరోనా ఎలా వచ్చిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇటీవల భుజానికి స్కానింగ్ చేయించడానికి బయో బబుల్ వాతావరణం నుంచి వరుణ్ చక్రవర్తి బయటకు వెళ్లాడు. దాంతో అతడికి కరోనా సోకినట్లు ఐపీఎల్ 2021 అధికారులు భావిస్తున్నారు. కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా సోకడంతో నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB)తో జరగనున్న మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేసింది.


Also Read: Cricket Australia Donation: భారత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆపన్నహస్తం, 50వేల డాలర్లు కరోనా విరాళం



కోల్‌కతా నైట్ రైడర్స్‌కు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఐపీఎల్ మ్యాచ్ రీషెడ్యూల్ చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు జాతీయ మీడియా ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది. కేకేఆర్ జట్టులో ఇతర ఆటగాళ్లకు కరోనా నెగెటివ్ రావడంతో ఫ్రాంచైజీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్‌(IPL 2021) ప్రారంభమయ్యాక సీజన్ మధ్యలో ఆటగాళ్లకు కరోనా వైరస్(CoronaVirus) సోకడం ఇదే తొలిసారి.


Also Read: IPL 2021: SRH కెప్టేన్ డేవిడ్ వార్నర్‌ కాదు.. Kane Williamson


కాగా, ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందు నిర్వహించిన టెస్టుల్లో ముంబై ఇండియన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లు కొందరికి పాజిటివ్‌గా తేలింది. అయితే చికిత్స అనంతరం వారం రోజులకు వారు కోవిడ్19 బారి నుంచి కోలుకుని మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడ్డారు. అసలే పేలవ ప్రదర్శన చేస్తున్న కేకేఆర్‌కు కీలకమైన బౌలర్ వరుణ్ చక్రవర్తి దూరమైతే ఇబ్బందులు తప్పవు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook