IPL 2021: Sanju Samson యంగ్ కెప్టెన్ కాదు, ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు
IPL 2021 Sanju Samson : ముఖ్యంగా యువ ఆటగాళ్లకు, అదీ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లకు కెప్టెన్సీ పగ్గాలు చేతికివ్వడం శుభపరిణామంగా చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా యువ ఆటగాళ్లకు, అదీ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్లకు కెప్టెన్సీ పగ్గాలు చేతికివ్వడం శుభపరిణామంగా చెప్పవచ్చు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ స్టీవ్ స్మిత్‌ను వదులుకుంది. దాంతో టాలెంటెడ్ కీపర్ బ్యాట్స్‌మెన్ సంజూ శాంసన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించింది.
ఢిల్లీ క్యాపిటల్స్ సైతం యువ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు గాయం కావడంతో రిషబ్ పంత్‌కు కెప్టెన్సీ అప్పగించింది. జట్టులో అజింక్య రహానే, శిఖర్ ధావన్, రవిచంద్రన్ అశ్విన్ లాంటి సీనియర్లు ఉన్నప్పటికీ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించడం గమనార్హం. ఐపీఎల్ 2021(IPL 2021)లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చిన్న వయసు కెప్టెన్ కాకపోయినా, అతడు గ్రేట్ క్రికెట్ బ్రెయిన్ అని దక్షిణాఫ్రికా ఆల్ రౌండర్, జట్టు సహచర ఆటగాడు క్రిస్ మోరిస్ వ్యాఖ్యానించాడు.
Also Read: IPL 2021: ఎంఎస్ ధోనీ కెప్టెన్సీలో ఆడబోతున్నాను, నా కల నెరవేరనుంది: యువ క్రికెటర్
ఏవైనా సలహాలు అడగాల్సి వస్తే సంజూ శాంసన్‌ను సంప్రదించేందుకు తనకు ఏ మొహమాటం లేదన్నాడు. లక్కీగా తాను రాజస్థాన్, ఢిల్లీ జట్ల తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న సమయంలో సంజూ శాంసన్‌తో కలిసి ఆడానని గుర్తు చేసుకున్నాడు క్రిస్ మోరిస్. సంజూ శాంసన్(Sanju Samson)తో తన రిలేషన్ బాగుందని, అతడిని యువ కెప్టెన్‌గా కాకుండా, అత్యుత్తమ క్రికెటర్‌గా మాత్రమే భావిస్తానని తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. నిన్న జరిగిన వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రాజస్థాన్ రాయల్స్ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్, నూతన కెప్టెన్ సంజూ శాంసనపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశాడు.
వికెట్ కీపర్ కెప్టెన్ అయితే అతడికి మైదానంలోని అన్ని కోణాలు బాగా తెలుసునని, అతడు ఆటను చూసే విధానం ఇతర క్రికెటర్లతో పోల్చితే చాలా భిన్నంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. నూతన కెప్టెన్ శాంసన్‌కు తన మద్దతు 100 శాతం ఉంటుందని, జట్టు కోసం అతడితో కలిసి వ్యూహాలు రచిస్తానని చెప్పాడు. శాంసన్ కెప్టెన్సీలో ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. ఐపీఎల్ 13 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాలలో తన వంతు పాత్ర పోషించిన క్రిస్ మోరిస్ తాజా సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహించనున్నాడు.
Also Read: Irfan Pathan: మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్‌కు కరోనా పాజిటివ్, సచిన్‌తో మొదలైంది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook