IPL 2021: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 (Indian Premier League 2021) మళ్లీ ప్రారంభం కానుంది. కరోనా కారణంగా ఆగిపోయిన లీగ్ మళ్లీ రేపటి నుండి యూఏఈ (UAE)లో ప్రారంభం కానున్నాయి. భారత్ లో మొదట 29 మ్యాచ్ లో జరిగాయి, కరోనా (Corona) అధికం అవటం మరియు ఆటగాళ్లు కరోనా భారిన పడటం కారణంగా ఐపీఎల్ (IPL) వాయిదా పడిన విషయం మన అందరికీ తెలిసిందే!


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడు నెలల విరామం తరువాత, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2021 సెప్టెంబర్ 19 న మొదలుకానుంది. ఆగిపోయినప్పటి నుండి  బీసీసీఐ (BCCI) చేసిన ప్రయత్నాలు ఫలించి, యూఏఈలో (UAE) రేపటి నుంచి మరోసారి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు రెడీ అయింది.


Also Read: Amit Shah speech in Nirmal meeting: నిర్మల్ బహిరంగ సభలో CM KCR పై అమిత్ షా ఫైర్



ఇంకా 31 మ్యచ్ లు జరగాల్సి ఉండగా.. 27 రోజుల్లో ఐపీఎల్ 2021 రెండో దశ పూర్తీ కానుంది. మొదటగా అబుదాబిలో (Abu Dhabi) జరగబోయే ముంబై ఇండియన్స్‌ (Mumbai Indians)వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్‌ (Chennai Super Kings) మ్యాచుతో ప్రారంభం అవగా.. రెండో మ్యాచ్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో (RCB) తలపడుతుంది. 


దుబాయ్‌లో 13, షార్జాలో 10, అబుదాబిలో 8 మ్యాచ్‌లు జరగగా... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరుతో చివరి లీగ్ మ్యాచ్ అక్టోబర్ 8న జరగనుంది. ఇందులో ఇప్పటి వరకి భారత్ లో జరిగిన 29 మ్యాచ్ ఫలితాల పట్టిక చూస్తే ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచ్ లు ఆడి 12 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా..  చెన్నై సూపర్ కింగ్స్ 10 పాయింట్లతో రెండో స్థానంలో, రాయల్ ఛాలెంజర్స్ 10 పాయింట్లతో మూడో స్థానంలో మరియు 8 పాయింట్లతో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానంలో ఉంది. 


Also Read: Devi sri Prasad: దేవీ శ్రీ ప్రసాద్ ఇంట్లో విషాదం.. రోడ్డు ప్రమాదంలో బాబాయి, Heart attack తో మేనత్త మృతి


పీఎల్ 2021 రెండో దశ మ్యాచ్ లను లైవ్ స్ట్రీమింగ్‌ను ఆన్‌లైన్‌లో హాట్‌స్టార్, జియోటీవీలో చూడవచ్చు. యధావిదిగానే మ్యాచ్ లన్ని స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ HD ఛానెళ్లలో టెలికాస్ట్ కానున్నాయి. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook